Sonu Sood: ఆగిపోయిన సోనూ సూద్ వాట్సాప్‌ ! 61 గంటల్లో 9,483 మెసేజ్ లు !

ఆగిపోయిన సోనూ సూద్ వాట్సాప్‌ ! 61 గంటల్లో 9,483 మెసేజ్ లు !

Sonu Sood: తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు సోనూ సూద్. క్యారెక్టర్ ఆర్టిస్ట్, విలన్ గానే కాకుండా తన సామాజిక సేవతో మానవతా వాదిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అల్లు అర్జున్‌ నటించిన జులాయితో… అరుంధతి సినిమాలో పశుపతిగా తెలుగు ప్రేక్షకుల గుండెల్లో సుస్ధిత స్థానం దక్కించుకున్నారు. ప్రస్తుతం బాలీవుడ్‌ లో ఫతే మూవీలో కనిపించనున్నారు. ఈ సినిమా త్వరలోనే రిలీజ్ కానుంది. అయితే తాజాగా సోనూ సూద్ వాట్సాప్‌ ఒక్కసారిగా నిలిచిపోయింది. దీనితో ఈ విషయాన్ని ఆయన తన ట్విటర్‌ ద్వారా సమస్యను ప్రస్తావించారు.

Sonu Sood Whatsapp Issue

సోనూ సూద్ విజ్ఞప్తిని పరిశీలించిన వాట్సాప్ యాజమాన్యం అతని ఖాతాను పునరుద్ధరించింది. అయిదే దాదాపు 61 గంటల తర్వాత అతని వాట్సాప్ సేవలు అందుబాటులోకి వచ్చాయి. ఇదే విషయాన్ని సోనూ తన ట్విటర్ ద్వారా తెలిపారు. ఫైనల్‌ గా నా వాట్సాప్ తిరిగి పనిచేస్తోంది. అయితే కేవలం 61 గంటల వ్యవధిలోనే 9,483 సందేశాలు వచ్చాయి అంటూ పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్‌ నెట్టింట తెగ వైరవుతోంది. కాగా.. సోనూ సూద్‌ నటిస్తోన్న ఫతే సినిమాలో జాక్వెలీన్ ఫెర్నాండెజ్ కూడా ప్రధాన పాత్రలో నటించారు. ఈ చిత్రం ద్వారా సోనూ దర్శకుడిగా కూడా పరిచయం అవుతున్నారు. శక్తి సాగర్ ప్రొడక్షన్స్, జీ స్టూడియోస్ నిర్మించిన ఈ చిత్రం సైబర్ క్రైమ్ నేపథ్యంలో తెరకెక్కించారు. ఈ చిత్రం ఈ ఏడాదిలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.

Also Read : Samantha Ruth Prabhu: అభిమానులకు ‘బంగారం’లాంటి కబురు చెప్పిన సమంత !

ArundhatiJulaiSonu Sood
Comments (0)
Add Comment