Sonu Sood: కుమారి ఆంటీ ఫుడ్‌ స్టాల్‌ ను సందర్శించిన సోనూసూద్‌ !

కుమారి ఆంటీ ఫుడ్‌ స్టాల్‌ ను సందర్శించిన సోనూసూద్‌ !

Sonu Sood: తెలుగు రాష్ట్రాల్లో ఇటీవలి కాలంలో సెన్సేషన్‌ గా మారిన పేరు కుమారి ఆంటీ. హైదరాబాద్ లో రోడ్ సైడ్ చిన్న హోటల్ నడుపుతూ ఈమె బాగా ఫేమస్ అయ్యింది. తక్కువ ధర, మంచి రుచితో పాటు భోజనానికి వచ్చే కష్టమర్లకు ఆప్యాయంగా పలకరించే కుమారి ఆంటీ ఓవర్ నైట్ సెలబ్రెటీగా మారింది. ఈవిడ భోజనం వడ్డిస్తే ఆహా ఏమి రుచి.. అనరా మైమరిచి.. అనుకుంటూ లొట్టలేసుకు తినాల్సిందే అంటూ ఈమె చేతివంట రుచి చూసేందుకు ఎక్కడెక్కడి నుంచో వస్తుంటారు. హైదరాబాద్‌ నగరంలో రోడ్డు పక్కన చిన్నపాటి హోటల్‌ పెట్టి వెజ్‌, నాన్‌ వెజ్‌ వంటకాలను అమ్ముతూ చేతినిండా సంపాదిస్తోంది. యూట్యూబ్‌లో మార్మోగిపోయిన కుమారి ఆంటీ దగ్గరికి ఆ మధ్య హీరో సందీప్‌ కిషన్‌ కూడా వెళ్లొచ్చాడు.

Sonu Sood Meet

తాజాగా నటుడు సోనూసూద్‌(Sonu Sood) ఆమె ఫుడ్‌ స్టాల్‌ను సందర్శించాడు. తనను కలిసి బిజినెస్‌ ఎలా సాగుతుందో అడిగి తెలుసుకున్నాడు. కుమారి ఆంటీ స్త్రీ శక్తికి తార్కాణం. కష్టపడితే ఫలితం ఉంటుందన్నదానికి ఈవిడే నిదర్శనం అని పేర్కొన్నాడు. స్వయంకృషితో ఎదిగే ఇలాంటివారిని సపోర్ట్‌ చేద్దామని తెలిపాడు. నేను వెజ్‌ తింటాను.. నాకు డిస్కౌంట్‌ ఎంతిస్తావని సోనూసూద్‌ అడగ్గా కుమారి ఆంటీ ఫ్రీగా ఇస్తానంది. ఎంతోమందిని కష్టకాలంలో ఆదుకున్నారు… ఇంకెంతోమందికి సాయం చేస్తూనే ఉన్నారు… అలాంటి మీకు ఏమిచ్చినా తక్కువే అని కుమారి ఆంటీ అనడంతో సోనూసూద్‌ సంతోషపడ్డాడు. అనంతరం ఆమెకు శాలువా కప్పి సత్కరించాడు.

Also Read : Sarah-Jane Dias : గుర్తుపట్టలేనంతగా మారిన పవన్ హీరోయిన్ ‘సారా’

Kumari AuntySonu Sood
Comments (0)
Add Comment