Sonu Sood : ప్రముఖ నటుడు సోనూ సూద్ మంగళవారం (జులై 30) తన పుట్టినరోజును సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ సందర్భంగా పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు రియల్ హీరోకు బర్త్ డే విషెస్ చెప్పారు. ఇక నిన్న సోషల్ మీడియాలో సోనూ సూద్ పేరు బాగా మార్మోగిపోయింది. చాలా చోట్ల ఆయన అభిమానులు రక్తదానం, అన్నదానం తదితర సేవా కార్యక్రమాలు నిర్వహించారు. తద్వారా తమ హీరోపై అభిమానాన్ని వినూత్నంగా చాటుకున్నారు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ కు చెందిన విద్యార్థులు కూడా సోనూ సూద్(Sonu Sood) కు వెరైటీగా పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. చిత్తూరు జిల్లా కుప్పంలోని హాకింగ్ ఇంటర్నేషనల్ స్కూల్ విద్యార్థులు ఆయన ముఖచిత్ర ఆకారంలో నిలబడి రియల్ హీరోకు విషెస్ చెప్పారు. సుమారు 1200 మంది విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం విశేషం. ఈ సందర్భంగా ‘హ్యాపీ బర్త్ డే రియల్ హీరో’ అంటూ హర్ష ధ్వానాలు చేశారు విద్యార్థులు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Sonu Sood Birthday
ప్రార్థించే పెదవులు కన్నా..సాయం చేసే చేతులు మిన్న అన్న మాటను అక్షరాల ఆచరణలో పెడుతున్నాడు సోనూ సూద్. ఎన్నో సినిమాల్లో విలన్ పాత్రలు పోషించిన సోనూ సూద్(Sonu Sood) నిజ జీవితంలో మాత్రం రియల్ హీరోగా వెలుగొందుతున్నాడు. కరోనా సమయంలో ఎంతో మంది పేదలకు ఆపన్న హస్తం అందించిన ఆయన ఆ తర్వాత ‘సోనూ ఫౌండేషన్’ స్థాపించి అడిగిన వారందరికీ ఏదో ఒక విధంగా సాయం చేస్తున్నాడు. ఇటీవలే ఏపీలోని కర్నూలు జిల్లాకు చెందిన ఓ పేద విద్యార్థిని చదువుకు సాయమందించాడు. దీంతో సదరు విద్యార్థిని కుటుంబ సభ్యులు సోనూ సూద్ చిత్ర పటానికి పాలాభిషేకం చేశారు. క సినిమాల విషయానికి వస్తే.. గతేడాది కన్నడ, తమిళ సినిమాల్లో నటించాడు సోనూ సూద్. ప్రస్తుతం ‘ఫతేహా’ అనే సినిమాలో యాక్ట్ చేస్తున్నాడు. ఈ సినిమాకు అతనే దర్శకత్వం కూడా వహించనున్నాడు. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించి మరిన్ని అప్ డేట్స్ రానున్నాయి.
Also Read : Pushpa 2 : మరోసారి బన్నీ పుష్ప 2 నుంచి వీడియో లీక్..