Sonam Kapoor: ప్రముఖ బాలీవుడ్ హీరో అనిల్ కపూర్ కుమార్తెగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన భామ సోనమ్ కపూర్. సావరియా సినిమాతో బాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ చివరిసారిగా బ్లైండ్ సినిమాలో కనిపించింది. ఆదివారం ఆమె 39వ వసంతంలోకి అడుగుపెట్టారు. దీనితో సోనమ్ కపూర్ బర్త్ డే సందర్భంగా ఆమె భర్త ఆనంద్ అహుజా ప్రత్యేకంగా విషెస్ తెలిపారు. తన భార్యకు రవీంద్రనాథ్ ఠాగూర్ ‘గీతాంజలి’ బుక్‌ను పుట్టినరోజు కానుకుగా అందించారు. ఈ విషయాన్ని సోనమ్ కపూర్ తన ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది.
Sonam Kapoor…
తన భర్త ఆనంద్ అహుజా ఇచ్చిన స్పెషల్ బర్త్ డే గిఫ్ట్ గురించి సోనమ్ కపూర్ ఇన్‌స్టాలో రాస్తూ… ‘ఇది నాకు అద్భుతమైన పుట్టినరోజు కానుక. నాకేం కావాలో నా భర్తకు మాత్రమే తెలుసు. ఠాగూర్ రాసిన గీతాంజలి మొదటి ఎడిషన్ గిఫ్ట్‌గా ఇచ్చారు. ఈ అర్హత సాధించడానికి నీ కోసం ఏం చేశానో నాకు తెలియదు.” అంటూ పోస్ట్ చేసింది. సోనమ్ బర్త్ డే సందర్భంగా ఆమె తండ్రి అనిల్ కపూర్ విషెస్ తెలిపారు. ఆమె తల్లి సునీతా కపూర్ సైతం సోషల్ మీడీయా వేదికగా శుభాకాంక్షలు తెలిపారు.
Also Read : Karthi: కార్తీ ‘వా వాతియార్’ ఫస్ట్ లుక్ రిలీజ్ !