Sonali Bendre: ‘మురారి’ సినిమా రీ రిలీజ్‌ పై హీరోయిన్ సోనాలి బింద్రే ఆశక్తికరమైన పోస్ట్ !

'మురారి’ సినిమా రీ రిలీజ్‌ పై హీరోయిన్ సోనాలి బింద్రే ఆశక్తికరమైన పోస్ట్ !

Sonali Bendre: ప్రిన్స్‌ మహేశ్‌ బాబు పుట్టినరోజు సందర్భంగా బ్లాక్‌ బస్టర్‌ మూవీ ‘మురారి’ రీ రిలీజ్‌ చేసిన సంగతి తెలిసిందే. టాలీవుడ్ సన్సేషన్ డైరెక్టర్ కృష్ణవంశీ తెరకెక్కించిన ఈ సినిమాలో మహేశ్ సరసన సోనాలి బింద్రే(Sonali Bendre) నటించగా… మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీతం అందించారు. తెలుగు సంస్కృతి సాంప్రదాయం ఉట్టిపడేలా ఈ సినిమాలోని పాటలు, పెళ్ళి తంతు ఇప్పటికీ ఓ ఎపిక్ లా ఉంటుంది. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో థియేటర్ల వద్ద మహేశ్‌ ఫ్యాన్స్‌ చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. అభిమాన హీరో సినిమా 23 ఏళ్ల తర్వాత రావడంతో కోలాహలం సృష్టించారు. కొందరైతే ఏకంగా థియేటర్లోనే పెళ్లి కూడా చేసుకున్నారు. దీనికి సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్‌ అయ్యాయి.

Sonali Bendre Comment

ఈ నేపథ్యంలో ‘మురారి’ సినిమా రీ రిలీజ్‌పై హీరోయిన్ సోనాలి బింద్రే స్పందించారు. ట్విట్టర్‌ వేదికగా ఆమె ఓ పోస్ట్‌ చేశారు. “మహేశ్‌తో మురారి సినిమా చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. 23 ఏళ్ల తర్వాత కూడా మురారి సినిమాపై అదే ప్రేమ చూపించడం చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. మీ అందరి ప్రేమకు ధన్యవాదాలు. ఈ చిత్రాన్ని మాకు ఇంత ప్రత్యేకంగా మార్చిన డైరెక్టర్‌ కృష్ణ వంశీకి అభినందనలు’’ అని పోస్ట్‌లో పేర్కొన్నారు. ఇటీవలే క్యాన్సర్‌ను జయించిన సోనాలి బింద్రే మళ్లీ నటిగా సెకండ్‌ ఇన్నింగ్స్‌ ప్రారంభించింది. ప్రస్తుతం పలు సినిమాలు, వెబ్ సిరీస్‌, టాక్ షో లతో బిజీగా ఉంది.

Also Read : Balakrishna – Chiranjeevi: ఒకే వేదికపైకి బాలకృష్ణ-చిరంజీవి ?

Krishna VamsiMurariSonali BendreSuper Star Mahesh Babu
Comments (0)
Add Comment