Sonali Bendre: పదేళ్ల తర్వాత రీ ఎంట్రీ ఇస్తోన్న స్టార్ హీరోయిన్ !

పదేళ్ల తర్వాత రీ ఎంట్రీ ఇస్తోన్న స్టార్ హీరోయిన్ !

Sonali Bendre: సూపర్ స్టార్ మహేశ్ బాబు, కృష్ణవంశీ కాంబినేషన్ లో తెరకెక్కించిన ‘మురారి’ సినిమాతో టాలీవుడ్‌ ఎంట్రీ ఇచ్చిన సోనాలి బింద్రే… ఆ తరువాత దాదాపు తెలుగు స్టార్‌ హీరోలందరి సరసన నటించింది. తెలుగులో మురారి, మన్మధుడు, ఇంద్ర, ఖడ్గం, శంకర్‌ దాదా వంటి చిత్రాల్లో నటించిన సోనాలి చివరగా 2013లో ఒక బాలీవుడ్‌ సినిమాలో కనిపించి ఇండస్ట్రీకి దూరమయ్యారు. అయితే పెళ్లి తరువాత ఆమె సినిమాలకు పూర్తిగా దూరమయ్యారు. అంతేకాదు 2018లో క్యాన్సర్‌ బారిన పడిన సోనాలి… న్యూయార్క్‌ లో చికిత్స అనంతరం కోలుకుంది.

Sonali Bendre Re-entry

అయితే సుమారు పదేళ్ల తర్వాత మళ్లీ రంగుల ప్రపంచంలోకి అడుపెట్టింది సోనాలి బింద్రే(Sonali Bendre). ఈ క్రమంలో ఆమె పలు రియాలిటీ షోలలో జడ్జ్‌ గా ఉన్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ది బ్రోకెన్ న్యూస్‌ సీజన్‌ 2 వెబ్‌ సిరీస్‌ లో ఆమె కనిపిచనున్నారు. జీ5 వేదికగా మే3 నుంచి స్ట్రీమింగ్ కానున్న ఈ వెబ్‌ సిరీస్‌ ప్రమోషన్‌ లో భాగంగా చాలా రోజుల తర్వాత ఆమె పలు ఇంటర్వ్యూలో పాల్గొంటున్నారు. అందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు వైరల్‌ అవుతున్నాయి.

ఇంటర్‌ చదువుతున్న రోజుల్లోనే తల్లిదండ్రులకు ఇష్టం లేకపోయినా కూడా తన కుటుంబం కోసం ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ఆమె… 90వ దశకంలో టాప్‌ హీరోయిన్‌గా కొనసాగారు. కానీ 2013 నుంచి సినిమాలకు దూరంగా ఉన్న ఆమె ఇప్పడు ఇండస్ట్రీలో రీఎంట్రీ ఇచ్చారు. అందుకు కూడా కారణం ఉందని ఆమె ఇలా చెప్పుకొచ్చారు. ‘ఇప్పుడు నాకు కూడా డబ్బు అవసరం ఉంది. నేను చెల్లించాల్సిన బిల్లులు చాలా పెండింగ్‌లో ఉన్నాయి. అందుకోసం నేను పని చేయవలసి ఉంది. నా కుటుంబం కూడా చాలా క్లిష్టమైన ఇబ్బందులను ఎదుర్కొంటుంది. అని ఆమె తెలిపారు. చాలా ఏళ్ల తర్వాత తమ అభిమాన హీరోయిన్‌ మళ్లీ ఎంట్రీ ఇస్తున్నడంతో ఫ్యాన్స్‌ కూడా స్వాగతం పలుకుతున్నారు.

Also Read : Nag Ashwin: బర్త్‌ డే వేడుకల్లో దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ డ్యాన్స్‌ ! వైరల్‌ గా మారిన వీడియో !

Sonali BendreThe Broken NewsZee5
Comments (0)
Add Comment