Sonakshi Sinha: మనీషా కొయిరాలకు క్షమాపణలు చెప్పిన సోనాక్షి సిన్హా !

మనీషా కొయిరాలకు క్షమాపణలు చెప్పిన సోనాక్షి సిన్హా !

Sonakshi Sinha: దేవదాస్, పద్మావతి, గంగూభాయ్ కతివాడి, బాజీరావ్ మస్తానీ, రామ్ లీలా వంటి ఎన్నో వాస్తవిక కథలను కళ్ళకు కట్టినట్లు చూపించిన భారతీయ సినిమా స్థాయిని పెంచిన దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ. మొదటి సారిగా ఈ దర్శకుడు తన కలల ప్రాజెక్టు ‘హీరామండీ: ది డైమండ్‌ బజార్‌’ తో ఓటీటీలోనూ సత్తా చాటుతున్నారు. స్వాతంత్య్రానికి ముందు పాకిస్తాన్ లోని లాహోర్ లో ఉన్న వేశ్యల జీవితాల ఆధారంగా తెరకెక్కించిన ఈ వెబ్ సిరీస్ లో మనీషా కోయిరాలా, సోనాక్షి సిన్హా(Sonakshi Sinha), అదితిరావ్‌ హైదరీ, రిచా చద్దా, షర్మిన్‌ సెగల్‌, సంజీదా షేక్‌ ప్రధాన పాత్రల్లో నటించారు.

Sonakshi Sinha Comment

‘హీరామండీ: ది డైమండ్‌ బజార్‌’… బాలీవుడ్‌ అందాల తారలందరిని ఒకే ఫ్రేమ్‌ లో మహారాణుల మాదిరిగా చూపించడంతో ఇండస్ట్రీలో ఎక్కడ చూసినా ప్రస్తుతం ‘హీరామండి’కు సంబంధించిన వార్తలే కనిపిస్తున్నాయి. ఇటీవల విడుదలైన ఈ సిరీస్‌ టాప్ టెన్ లో స్ట్రీమింగ్ కావడంతో పాటు విమర్శకుల ప్రశంసలు కూడా అందుకుంటోంది. అయితే ఈ వెబ్ సిరీస్ కు సంబంధించి తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో సోనాక్షి సిన్హా తన సహనటి మనీషా కొయిరాలకు క్షమాపణలు చెప్పడం ఆశక్తికరంగా మారింది.

ఇటీవల ఓ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వూలో సోనాక్షి సిన్హా మాట్లాడుతూ… ‘నాకు మనీషా అంటే ఎంతో ఇష్టం. ‘హీరామండి: ది డైమండ్‌ బజార్‌’ వెబ్‌సిరీస్‌ మొత్తం చూసిన తర్వాత ఆమెకు క్షమాపణలు చెప్పాను. కొన్ని సన్నివేశాల్లో భాగంగా ఆమెతో దురుసుగా ప్రవర్తించాను. సిరీస్‌ చూశాక నేను వాటిని ఎలా చేయగలిగాను అనిపించింది. అందుకే సారీ చెప్పాను. ఆమె గొప్ప నటి. తన సహనటులను ఎంతో ప్రోత్సహిస్తారు. షూటింగ్‌ మొత్తం సరదాగా గడిపాం. అంత గొప్ప నటితో కలిసి పనిచేసే అవకాశం రావడం నా అదృష్టం. మళ్లీ ఆమెతో నటించే రోజు కోసం ఎదురుచూస్తున్నా’ అన్నారు. ఇక సంజయ్‌ లీలా భన్సాలీ గురించి మాట్లాడుతూ.. ‘ఆయన దర్శకత్వంలో నటిస్తే కష్టపడాల్సిన అవసరం లేదు. సీన్‌ కు ముందే అన్ని విషయాలు చర్చిస్తారు. భన్సాలీ నన్ను మెచ్చుకోవడం ఎప్పటికీ మర్చిపోలేను. ఇంత గొప్ప పాత్రను ఇచ్చినందుకు ఎప్పటికీ కృతజ్ఞతతో ఉంటాను’ అని చెప్పారు. ‘హీరామండి’లో సోనాక్షీ ద్విపాత్రాభినయం చేసిన సంగతి తెలిసిందే. ఇందులో ఆమె నెగెటివ్‌ ఛాయలున్న పాత్రల్లో కనిపించారు.

Also Read : Sathyaraj: త్వరలో ప్రధాని ‘నరేంద్ర మోదీ బయోపిక్’ !

HeeramandiManisha KoiralaSonakshi Sinha
Comments (0)
Add Comment