Sonakshi Sinha: సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో వచ్చిన హీరామండి: ది డైమండ్ బజార్ వెబ్ సిరీస్ తో ప్రేక్షకులను మెప్పించిన బాలీవుడ్ బ్యూటీ సోనాక్షి సిన్హా… గతనెల 23న వివాహబంధంలోకి అడుగుపెట్టింది. తన ప్రియుడు జహీర్ ఇక్బాల్ తో కలిసి ఏడడుగులు నడిచింది. ముంబయిలో జరిగిన వీరి పెళ్లికి సినీతారలు, సన్నిహితులు కూడా హాజరయ్యారు. ఇటీవల ఈ జంట హనీమూన్ కూడా వెళ్లారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరలయ్యాయి. అయితే పెళ్ళై వారం రోజులు తిరగకుముందే సోనాక్షి(Sonakshi Sinha) తల్లి కాబోతుందంటూ సోషల్ మీడియాలో పుకార్లు షికార్లు చేస్తున్నాయి.
Sonakshi Sinha Comment
ప్రస్తుతం సోనాక్షి తన తాజా సినిమా కుకుడ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకుని రిలీజ్ కు సిద్ధంగా ఉన్న ఈ సినిమాకు సంబంధించి ప్రమోషన్లలో ఆమె పాల్గొంటుంది. ఈ సందర్భంగా పలు ఛానెల్స్ ఇంటర్వ్యూలకు ఆమె హాజరవుతున్నారు. తాజాగా ఓ ఛానెల్ ఇంటర్వూలో జహీర్ ఇక్బాల్‌తో పెళ్లి తర్వాత ఆమె జీవితం గురించి ప్రశ్నించారు. నా లైఫ్ పెళ్లికి ముందు సంతోషంగానే ఉందని తెలిపారు. పెళ్లి తర్వాత మరింత ఆనందంగా ఉన్నానని సోనాక్షి వెల్లడించారు.
గతంలో మీరిద్దరు కలిసి ఓ ఆస్పత్రికి వెళ్లిన వీడియో సోషల్ మీడియాలో వైరలైంది. ఆ సమయంలో మీరు గర్భంతో ఉన్నారని ఊహనాగాలొచ్చాయి కదా ? దీనిపై మీరేమంటారు ? అంటూ సోనాక్షిని ప్రశ్నించారు ఆ ఛానెల్ యాంకర్. దీనిపై సోనాక్షి స్పందిస్తూ…’ ఇప్పుడు మేము ఆస్పత్రి వెళ్లలేము… ఎందుకంటే మీరు వెంటనే గర్భవతి అని డిసైడ్ చేసేస్తారు’ అంటూ ఫన్నీగా రిప్లై ఇచ్చింది.
Also Read : Bigg Boss: బిగ్‌బాస్ 8 లో వేణుస్వామి, బర్రెలక్క ?