Sonakshi Sinha Sensational :మా బంధానికి మ‌తం అడ్డంకి కాదు

స్ప‌ష్టం చేసిన సోనాక్షి సిన్హా

Sonakshi Sinha : టీఎంసీ ఎంపీ శ‌త్రుఘ్న సిన్హా ముద్దుల త‌న‌య సోనాక్షి సిన్హా(Sonakshi Sinha) ఆస‌క్తిక‌రమైన వ్యాఖ్య‌లు చేశారు. త‌ను ముస్లిం మ‌తానికి చెందిన జ‌హీర్ ఇక్బాల్ ను పెళ్లి చేసుకుంది. వీరిద్ద‌రూ చూడ ముచ్చ‌టైన జంట‌గా పేరు పొందారు. అయితే త‌ను ఇస్లాం మ‌తంలోకి మారారంటూ పెద్ద ఎత్తున ప్ర‌చారం జ‌రిగింది. దీనిపై సీరియ‌స్ గా స్పందించారు సోనాక్షి సిన్హా.

Sonakshi Sinha Comments

ప్రేమ, ప‌ర‌స‌ర్ప‌ర‌మైన న‌మ్మ‌కంతో కూడుకుని ఉన్న‌ది మా బంధం. మేం ఇద్ద‌రం లైఫ్ ను ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాం. ఈ త‌రుణంలో ఇత‌రుల గురించి, అప్ర‌స్తుత అంశాల గురించి ప‌ట్టించు కోవాల్సిన అవ‌స‌రం లేద‌ని పేర్కొంది. త‌మ‌కు మ‌తం అనేది అంశం కాద‌న్నారు సోనాక్షి సిన్హా.

మ‌త మార్పిడుల‌కు తాము పూర్తిగా విరుద్ద‌మ‌ని స్ప‌ష్టం చేశారు. ఇదిలా ఉండ‌గా ఈ ఇద్ద‌రు గ‌త ఏడాది 2024లో జూలై లో ఒక్క‌ట‌య్యారు. తామిద్ద‌రి మ‌ధ్య మ‌తం ఎప్పుడూ ఆందోళ‌న క‌లిగించే అంశం కాద‌ని స్ప‌ష్టం చేసింది ఈ బాలీవుడ్ బ్యూటీ.

చిట్ చాట్ సంద‌ర్బంగా ఆస‌క్తిక‌ర అంశాల‌ను పంచుకున్నారు సోనాక్షి సిన్హా. ఇద్ద‌రం ఒక్క‌టయ్యేందుకు మ‌తంతో ప‌నేంటి అంటూ ప్ర‌శ్నించింది. కావాల్సింది, అడుగులు వేయాల్సింది మేం ఇద్ద‌రం. మ‌తం అనేది అభిప్రాయాల‌కు సంబంధించిన‌ది..దానిని తాము ప‌ట్టించుకోమంటూ కొట్టి పారేసింది. మేం ఇద్ద‌రం ఎప్పుడూ మా మ‌తాల గురించి చ‌ర్చించిన దాఖలాలు లేవ‌న్నారు.

Also Read : Hero Dulquer-Lucky Baskhar OTT :ఓటీటీలో దుల్క‌ర్ ల‌క్కీ భాస్క‌ర్ టాప్

CommentsShockingSonakshi SinhaViral
Comments (0)
Add Comment