Sonakshi Sinha: మతాంతర వివాహాంపై ఎదుర్కొన్న ట్రోల్స్ కు ఒక్క వీడియోతో సమాధానం చెప్పిన సోనాక్షి !

మతాంతర వివాహాంపై ఎదుర్కొన్న ట్రోల్స్ కు ఒక్క వీడియోతో సమాధానం చెప్పిన సోనాక్షి !

Sonakshi Sinha: ప్రేమకు కులమత బేధాలు లేవు. ఈ విషయాన్ని నిరూపించిన ఎంతోమందిలో బాలీవుడ్ జంట సోనాక్షి సిన్హ- జహీర్‌ ఇక్బాల్‌ ఒకటి. వీరిద్దరూ ఈ ఏడాది జూన్‌లో పెళ్లి చేసుకున్నారు. పెద్దలను ఒప్పించి మరీ వైవాహిక బంధంలో అడుగుపెట్టారు. కానీ సోషల్‌ మీడియాలో మాత్రం ఈ జంటకు శుభాకాంక్షలు చెప్పినవారి కంటే విమర్శలతో బురద చల్లినవారే ఎక్కువ. అయితే వారందికీ ఒక్క వీడియోతో సమాధానం చెప్పింది ఈ యాపిల్ బ్యూటీ.

Sonakshi Sinha Comment

మతాంతర వివాహాన్ని వ్యతిరేకించిన వారికి సమాాధానంగా… వారి తిట్లను సైతం కొత్త జంట ఆశీర్వాదంగా తీసుకుంది. తమ ప్రయాణాన్ని మొదలుపెట్టింది. అప్పటినుంచి ప్రతి విషయాన్ని అభిమానులతో పంచుకుంటూనే ఉన్నారు. తాజాగా వీరు వినాయక చవితి పండగను సెలబ్రేట్‌ చేసుకున్నారు. సోనాక్షి(Sonakshi Sinha) సాంప్రదాయాలను ఇక్బాల్‌ గౌరవిస్తూ అతడి ఇంట్లోనే వినాయకుడిని ప్రతిష్టించారు. ఇద్దరూ కలిసి పండగను కన్నుల వేడుకగా జరుపుకుంటున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోను వీళ్లిద్దరూ ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా పంచుకున్నారు.

అందమైన డెకరేషన్‌ మధ్యలో బొజ్జ గణపయ్యను పూజించిన వీడియోను చూసి ఫ్యాన్స్‌ సంబరపడిపోయారు. ఇరు వర్గాల సాంప్రదాయాలను గౌరవించుకుంటూ, అన్ని పండగలను కలిసి సెలబ్రేట్‌ చేసుకుంటూ మీరు అందరికీ ఆదర్శంగా నిలవండి అని పలువురూ సూచిస్తున్నారు. ఇకపోతే సోనాక్షి చివరగా హీరామండి అనే నెట్‌ఫ్లిక్స్‌ వెబ్‌ సిరీస్‌లో కనిపించింది.

Also Read : Ramnagar Bunny: ఆటిట్యూడ్ స్టార్ చంద్రహాస్ ‘రామ్ నగర్ బన్నీ’  ఫస్ట్ లుక్ రిలీజ్ !

Sonakshi SinhaZaheer Iqbal
Comments (0)
Add Comment