Sonakshi Sinha: ప్రముఖ బాలీవుడ్ నటి సోనాక్షి సిన్హా ఎట్టకేలకు తన ఏడేళ్ల ప్రేమ బంధానికి తెరదించుతూ… తన ప్రియుడు జహీర్ ఇక్బాల్ తో వివాహబంధంలోనికి అడుగుపెట్టింది. ఎన్నో ఏళ్ల నుంచి ప్రేమ పక్షుల్లా విహరిస్తున్న ఈ బాలీవుడ్ కపుల్… ఆదివారం రిజిస్టర్డ్ మ్యారేజీతో ఒక్కటయ్యారు. ‘‘ఏడేళ్ల క్రితం ఇదే రోజు మేము ప్రేమలో పడిపోయాం. అప్పటి నుంచి ఆ ప్రేమను అలాగే నిలబెట్టుకోవాలని నిర్ణయించుకున్నాం. ఆరోజు పుట్టిన ప్రేమే ఈ మధుర క్షణానికి దారి తీసింది. మా ఇద్దరి కుటుంబాల ఆశీర్వాదంతో, దేవుని ఆశీసులతో ఇప్పుడు ఒక్కటయ్యాం’’ అంటూ సోనాక్షి పెళ్లి ఫొటోల్ని సామాజిక మాధ్యమాల వేదికగా పంచుకుంది. దీనితో నూతన దంపతులకు సినీ ప్రముఖులతో పాటు అభిమానులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
Sonakshi Sinha Marriage Updates
‘హీరామండీ:ది డైమండ్ బజార్’లో మెరిసిన బాలీవుడ్ అందాల తార సోనాక్షి సిన్హాపై పెళ్లి రూమర్స్ వచ్చాయి. తన ప్రియుడు, ప్రముఖ నటుడు జహీర్ ఇక్బాల్ తో గత ఏడేళ్ళుగా ప్రేమలో మునిగితేలుతున్న ఈ బ్యూటీ… త్వరలో పెళ్లి పీటలెక్కబోతున్నరంటూ పెద్ద ఎత్తు ప్రచారం జరిగింది. వీరిద్దరు కలిసి ‘డబుల్ ఎక్సెల్’ సినిమాలో నటించిన సమయంలో స్నేహం ఏర్పడి… అది ప్రేమగా మారినట్లు తెలుస్తోంది. అయితే సోనాక్షి ప్రేమ వ్యవహారంపై తనకుక సమాచారం లేదంటూ ఆమె తండ్రి, బాలీవుడ్ సీనియర్ నటుడు శతృఘ్నసిన్హా కొద్దిరోజుల క్రితం చెప్పారు.
Also Read : Chitral Rangaswamy: రేణుకాస్వామిపై కన్నడ నటి సంచలన వ్యాఖ్యలు !