Sonakshi Sinha: పెళ్లికి ముందు ఏడేళ్లు డేటింగ్‌ చేసిన బాలీవుడ్ బ్యూటీ !

పెళ్లికి ముందు ఏడేళ్లు డేటింగ్‌ చేసిన బాలీవుడ్ బ్యూటీ !

Sonakshi Sinha: ఈ ఏడాది వివాహబంధంలోకి అడుగుపెట్టిన సినీ తారల్లో బాలీవుడ్‌ నటి సోనాక్షి సిన్హా ఒకరు. తన ప్రియుడు జహీర్‌ ఇక్బాల్‌తో జూన్‌ లో ఆమె పెళ్లి జరిగింది. తాజాగా ఈ జంట ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ప్రేమ, పెళ్లి గురించి మాట్లాడారు. దాదాపు ఏడేళ్ల క్రితమే తమ రిలేషన్‌ మొదలైందని చెప్పారు.

Sonakshi Sinha…

‘‘జహీర్‌ నాకు ఎంతో కాలం నుంచి తెలుసు. ఏడేళ్ల నుంచి మేము డేటింగ్‌లో ఉన్నాం. పెళ్లికి ముందు ఎక్కడా మా రిలేషన్‌ గురించి ప్రస్తావించలేదు. ఇది మా వ్యక్తిగత విషయం. అందుకే సీక్రెట్‌ గా ఉంచాం. చెబితే దిష్టి తగులుతుందని అనుకున్నా. ఇరు కుటుంబాల పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నప్పుడు… ఆ క్షణాలను ప్రత్యేకంగా మార్చాలనుకున్నాం. ఈ క్రమంలోనే మమ్మల్ని ప్రేమించే వారి సమక్షంలో సింపుల్‌ గా సెలబ్రేట్‌ చేసుకున్నాం. ఆత్మీయుల సమక్షంలో ఎలాంటి హడావుడి లేకుండా ప్రశాంతంగా మా పెళ్లి జరిగింది. పెళ్లికి సంబంధించిన ప్రతి క్షణాన్ని మేమిద్దరం ఎంజాయ్‌ చేశాం’’ అని సోనాక్షి(Sonakshi Sinha) తెలిపారు.

అనంతరం ఆమె భర్త జహీర్‌ ఇక్బాల్‌ మాట్లాడారు. తమ ప్రేమ గురించి మొదట ఇంట్లో చెప్పింది తానేనని అన్నారు. ‘‘సోనాక్షితో రిలేషన్‌ గురించి ఆమె తండ్రి శత్రుఘ్నసిన్హాకు మొదట చెప్పింది నేనే. ఆయనతో ఈ విషయం చెప్పడానికి నిర్ణయించుకున్నాక.. చాలా కంగారుపడ్డా. ఏం చెప్పి ఒప్పించాలి ? ఇంట్లో నుంచి గెంటేస్తే ఏం ఎలా? అని ఎన్నో ఆలోచనలు చేశా. కానీ, ఆయన్ని కలిశాక నా అనుమానాలన్నీ పటాపంచలు అయ్యాయి. ఆయన చాలా చక్కగా మాట్లాడారు. మమ్మల్ని అర్థం చేసుకున్నారు’’ అని చెప్పారు. ఈ ఏడాది జూన్‌ 23న వీరి పెళ్లి జరిగింది. పెళ్లి తర్వాత వరుస ట్రోల్స్‌ వచ్చాయి. ‘ప్రేమే పెద్ద మతం’ అంటూ గతంలో ఆమె వాటికి బదులిచ్చారు. వీరిద్దరూ కలిసి ‘డబుల్‌ ఎక్స్‌ఎల్‌’ సినిమాలో నటించిన సంగతి తెలిసిందే.

Also Read : Maa Nanna Super Hero: సుధీర్‌ బాబు ‘మా నాన్న సూపర్‌ హీరో’ నుండి వెడ్డింగ్‌ సాంగ్‌ రిలీజ్‌ !

Shatrughan SinhaSonakshi SinhaZaheer Iqbal
Comments (0)
Add Comment