Hero Bunny-Pushpa 2 : సంధ్య థియేటర్ కేసులో బన్నీకి కొంత ఊరట

అల్లు అర్జున్ వినతిని పరిగణనలోకి తీసుకున్న న్యాయస్థానం..

Pushpa 2 : సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసుకు సంబంధించి నాంపల్లి కోర్టులో హీరో అల్లు అర్జున్ కు ఊరట లభించింది. ప్రతి ఆదివారం హాజరు కావాలన్న నిబంధనల నుంచి కోర్టు మినహాయించింది. గతంలో ప్రతి ఆదివారం చిక్కడపల్లి పోలీసుల ఎదుట హాజరుకావాలని అల్లు అర్జున్(Allu Arjun) కు షరతులు విధించింది కోర్టు. అయితే భద్రతా కారణాల దృష్ట్యా మినహాయింపు ఇవ్వాలని బన్నీ న్యాయస్థానాన్ని కోరాడు . అల్లు అర్జున్ వినతిని పరిగణనలోకి తీసుకున్న న్యాయస్థానం నిబంధనల నుంచి అతనికి మినహాయింపు ఇచ్చింది.

మరోవైపు అల్లు అర్జున్ విదేశాలకు వెళ్లేందుకు కూడా కోర్టు నుంచి అనుమతి లభించింది. సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట ఘటనకు సంబంధించి అల్లు అర్జున్ దాఖలు చేసిన రెగ్యులర్ బెయిల్ పిటిషన్ పై ఈ నెల 3వ తేదీన నాంపల్లి కోర్టు తీర్పు వెలువరించింది. రూ. 50 వేల రెండు పూచీకత్తులను, ప్రతి ఆదివారం చిక్కడపల్లి పీఎస్ కు హాజరుకావాలని, సాక్షులను ప్రభావితం చేయొద్దని షరతులు విధించింది.

Pushpa 2 Movie-Sandhya Theatre Stampede

న్యాయస్థానం ఆదేశాల మేరకు గత ఆదివారం అల్లు అర్జున్ చిక్కడపల్లి పీఎస్ కు స్వయంగా హాజరై సంతకం చేసి వెళ్లారు. అయితే కొన్ని భద్రతా కారణాలతో ఈ షరతుల నుంచి అల్లు అర్జున్న కోర్టును మినహాయింపు కోరారు. ఇందుకు కోర్టు కూడా సానుకూలంగా స్పందించి నిబంధనల నుంచి మినహాయింపు ఇచ్చింది.

Also Read : Hero Ajith Kumar : అజిత్ అభిమానులకు చేదు వార్త

allu arjunPolice CasePushpa 2Sandhya TheatreUpdatesViral
Comments (0)
Add Comment