Sobhitha Dhulipala : మరోసారి తన రేంజ్ ఏంటో చూపించిన శోభిత

ఈ ఏడాది ఎమ్మీ అవార్డులను ఇంటర్నేషనల్ అకాడమీ ఆఫ్ టెలివిజన్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ అందజేయనుంది...

Sobhitha Dhulipala : నటి సమంతతో విడాకుల అనంతరం యాక్టర్ నాగ చైతన్య బాలీవుడ్ బ్యూటీ శోభిత ధూళిపాళ్లను వివాహం చేసుకోనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే పలువురు నాగ చైతన్య అభిరుచిని అవహేళన చేస్తూ.. శోభితాని ట్రోల్ చేస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ట్రోల్ర్స్‌కి తన భాషలో సమాధానం చెప్పింది శోభిత. అది మాటల్లో కాదు చేతల్లో. శరీర సౌందర్యమే బ్యూటీ అనుకుంటే దానికంటే మూర్కత్వం ఏమి ఉండదు. బుద్ధి, ప్రతిభలు అసలైన అందానికి ప్రామాణాలు. ఇలా అయితే శోభిత(Sobhitha Dhulipala) మోస్ట్ బ్యూటీ ఫుల్ వుమెన్. తనదైన విలక్షణ నటనతో బాలీవుడ్ తో పాటు వివిధ ఇండస్ట్రీలలో మంచి పేరు సంపాదించుకుంది ఆమె. కానీ, ఎందుకో తెలుగు ప్రేక్షకులు కాస్త ఈర్ష పెంచుకున్నారు. ఇదంతా పక్కన పడితే ఆమె ప్రపంచంలోనే ప్రతిష్టాత్మక ఎమ్మీ అవార్డుల నామినేషన్స్ లో నిలిచింది.

Sobhitha Dhulipala…

ఈ ఏడాది ఎమ్మీ అవార్డులను ఇంటర్నేషనల్ అకాడమీ ఆఫ్ టెలివిజన్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ అందజేయనుంది. భారత కాలమానం ప్రకారం ఈ వేడుక మంగళవారం తెల్లవారుజామున 3:30 గంటలకు టీవీలో ప్రత్యక్ష ప్రసారం కానుంది. 52వ అంతర్జాతీయ ఎమ్మీ అవార్డుల ఈవెంట్‌ యూఎస్‌లోని న్యూయార్క్‌లో నిర్వహిస్తున్నారు. ఈ ఈవెంట్‌కు తొలిసారి ఇండియన్‌ కమెడియన్‌, నటుడు వీర్ దాస్ తొలిసారి హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ ఏడాది 21 దేశాల నుంచి 56 మంది నామినేషన్స్‌లో ఉన్నారు. దాదాపు 14 విభాగాల్లో ఎంపిక చేసి అవార్డులు ప్రకటిస్తారు. కాగా, ఈ ఏడాది అనిల్ కపూర్, ఆదిత్య రాయ్ కపూర్, శోభితా ధూళిపాళ్ల(Sobhitha Dhulipala) నటించిన వెబ్ సిరీస్‌ ‘ది నైట్ మేనేజర్’ ఉత్తమ డ్రామా సిరీస్ విభాగం- 2024 అంతర్జాతీయ ఎమ్మీ అవార్డులకు నామినేషన్స్‌లో నిలిచింది. ఈ సిరీస్ లెస్ గౌట్టెస్ డి డైయు (డ్రాప్స్ ఆఫ్ గాడ్) (ఫ్రాన్స్), ది న్యూస్ రీడర్ – సీజన్ 2 (ఆస్ట్రేలియా), ఐయోసి ఎల్ ఎస్పియా అర్రెపెంటిడో – సీజన్ 2 (అర్జెంటీనా)లతో ఈ అవార్డు కోసం పోటీపడునుంది.

ఇకనాగచైతన్య – శోభితా ధూళిపాళ్ల వివాహం డిసెంబర్‌ 4న హైదరాబాద్‌లో జరగనుంది. ఇరు కుటుంబాల పెద్దలు, ఆత్మీయుల సమక్షంలో ఈ వేడుక జరగనుందని తెలుస్తోంది. దీనిపై తాజాగా నాగార్జున కూడా స్పందించారు. ‘‘కుటుంబసభ్యులు, సన్నిహితులు, సినీ ప్రముఖులు మొత్తం 300 మందిని పిలవాలని అనుకుంటున్నాం. స్టూడియోలో అందమైన సెట్‌లో వీళ్ల పెళ్లి జరగనుంది. అలాగే పెళ్లి పనులు కూడా వాళ్లిద్దరే చేసుకుంటామన్నారు’’ అని అన్నారు. రిసెప్షన్‌ వివరాలను త్వరలో తెలుపుతామని నాగ్‌ చెప్పారు. నాగచైతన్య ప్రస్తుతం ‘తండేల్‌’ చిత్రం చేస్తున్నారు. చందు మొండేటి దర్శకుడు. సాయిపల్లవి కథానాయిక. దాంతోపాటు కార్తిక్‌ దండు దర్శకత్వంలో ఓ సినిమాను చై పుట్టినరోజు సందర్భంగా ప్రకటించారు.

Also Read : Samantha Slams : విడాకులు తీసుకుంటే నోటికి వచ్చినట్టు మాట్లాడతారా..

MoviesSobhita DhulipalaTrendingUpdatesViral
Comments (0)
Add Comment