Sobhita Dhulipala: అక్కినేని నట వారసుడు హీరో నాగచైతన్యతో ఇటీవలే ఎంగేజ్‌మెంట్ చేసుకున్న శోభిత ధూళిపాళ్ల నటించిన తాజా చిత్రం ‘లవ్, సితార’. ఫుల్ కామెడీ ఎంటర్ టైనర్ గా రూపొందించిన ఈ సినిమాకు వందన కటారియా దర్శకత్వం వహించారు. ఈ రొమాంటిక్ డ్రామా మూవీలో శోభితా(Sobhita Dhulipala)తో పాటు రాజీవ్ సిద్ధార్థ్ లీడ్ రోల్ పోషించారు. ఇంద్రఛూడన్, రిజుల్ రే, సీమా సాన్వీ కూడా కీలకపాత్రలు పోషించినట్టు తెలుస్తోంది. త్వరలోనే ఈ మూవీ ట్రైలర్ వచ్చే అవకాశం ఉంది. అయితే ఈ మూవీని నేరుగా ఓటీటీలోనే రిలీజ్ చేస్తున్నారు మేకర్స్. ఈ నెల 27 నుంచి జీ5లో స్ట్రీమింగ్ కానుందని మేకర్స్ ప్రకటించారు. ఈ సందర్భంగా సంప్రదాయ వస్త్రధారణలో శోభితా ధూళిపాళ్ల నవ్వుతూ ఉన్న ఓ స్పెషల్ పోస్టర్‌ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. దీంతో పాటే స్ట్రీమింగ్ డే ట్‍ను కూడా వెల్లడించింది.
రొమాంటిక్ ఎమోషనల్ మూవీగా లవ్ సితార ఉండనుందని తెలుస్తోంది. “లవ్, హార్ట్ బ్రేక్, సెల్ఫ్ డిస్కవరీకి సంబంధించిన కథ ఇది. సెప్టెంబర్ 27న లవ్ సితార జీ5లో ప్రీమియర్ అవుతుంది” అంటూ జీ5 ఓటీటీ నేడు సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.
లవ్ సితార సినిమా షూటింగ్ చాలా ఆలస్యమైంది. 2020లోనే ఈ మూవీ షూటింగ్ మొదలైంది. అయితే, కరోనా రావడం సహా మరిన్ని కారణాలతో లేట్ అవుతూ వచ్చింది. ఇప్పుడు ఎట్టకేలకు ఈ చిత్రం అడుగుపెడుతోంది. ముందు నుంచి ఈ మూవీని ఓటీటీ కోసమే మేకర్స్ నిర్ణయించారు. అందుకు అనుగుణంగానే సెప్టెంబర్ 27న జీ5 ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో లవ్ సితార మూవీ స్ట్రీమింగ్‍కు రానుంది.
Sobhita Dhulipala – చైతూతో ఎంగేజ్‌మెంట్ !
టాలీవుడ్ హీరో, యువసామ్రాట్ అక్కినేని నాగతచైతన్యతో శోభిత ధూళిపాళ్ల(Sobhita Dhulipala)తో నిశ్చితార్థం చేసుకున్నారు. ఆగస్టు 8న హైదరాబాద్‌లోని నాగార్జున నివాసంలో కొద్దిమంది సన్నిహితుల సమంక్షంలో వీరి ఎంగేజ్‌మెంట్ వేడుక జరిగింది. త్వరలోనే ఈ జంట పెళ్లిబంధంతో ఒక్కటి కానున్నారు. ఈ విషయాన్ని హీరో నాగార్జున అధికారికంగా ట్విటర్‌లో పంచుకున్నారు.
Also Read : Taapsee Pannu: తాప్సీ ప్రధానపాత్రలో ‘గాంధారి’ !