Sobhita Dhulipala : చై శోభిత ఎంగేజ్మెంట్ పై ఇంట్రెస్టింగ్ వ్యాఖ్యలు చేసిన శోభిత

తనకు మాతృత్వం అంటే చాలా ఇష్టమని తెలిపింది. ఎప్పుడూ పెళ్లి చేసుకుని ....

Sobhita Dhulipala: అక్కినేని నాగచైతన్య, హీరోయిన్ శోభితా ధూళిపాళ్ల త్వరలోనే మూడు ముళ్ల బంధంలోకి అడుగుపెట్టనున్నారు. ఇటీవలే వీరిద్దరి నిశ్చితార్థం ఇరు కుటుంబసభ్యుల సమక్షంలో వేడుకగా జరిగింది. ఇందుకు సంబంధించిన ఫోటోలను తన సోషల్ మీడియాలో ఖాతాలో షేర్ చేస్తూ అధికారికంగా ప్రకటించారు నాగార్జున. ఆ తర్వాత తన ఎంగేజ్మెంట్ కు సంబంధించిన వీడియోస్, ఫోటోస్ షేర్ చేస్తూ సంతోషం వ్యక్తం చేసింది శోభితా(Sobhita Dhulipala). ఇదిలా ఉంటే.. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న శోభిత తన నిశ్చితార్థం వేడుక… పెళ్లి గురించి ఆసక్తికర విషయాలను పంచుకుంది. చైతూతో నిశ్చితార్థంతోపాటు పెళ్లి, పిల్లల గురించి చెప్పుకొచ్చింది. తన పెళ్లిలో కచ్చితంగా తెలుగు సంప్రదాయలను పాటించాలని ఉందని తెలిపింది. చైతూతో తన ఎంగేజ్మెంట్ ఎలా జరగాలని అనుకున్నానో అలాగే జరిగిందని.. కానీ అది సింపుల్ గా లేదా గ్రాండ్ గా జరిగిందా అనే విషయాన్ని తాను పెద్దగా పట్టించుకోలేదని తెలిపింది.

Sobhita Dhulipala Comment

“నిశ్చితార్థ వేడుక కోసం ఎన్నో కలలు, అంచనాలు, ప్లానింగ్స్ పెట్టుకొని ఆ క్షణం కోసం ఎదురుచూడలేదు.. కేవలం నేను ఆ క్షణాన్ని మనస్పూర్తిగా ఆస్వాదించాను. చాలా సింపుల్, రిలాక్స్ డ్ గా స్వీట్ గా జరిగింది. అందమైన విషయాలు జరిగినప్పుడు ఎలాంటి అలంకారాలు అవసరం లేదని నేను భావిస్తాను.. ఆ క్షణమే నాకు ముఖ్యమని అనిపిస్తుంది.. అందుకే ఎంత గ్రాండ్ గా జరిగింది అనే ఫీలింగ్ కాకుండా ఎలా జరగాలి అనుకున్నానో అలాగే జరిగింది.. ” అంటూ చెప్పుకొచ్చింది.

తనకు మాతృత్వం అంటే చాలా ఇష్టమని తెలిపింది. ఎప్పుడూ పెళ్లి చేసుకుని .. పిల్లలకు జన్మనిచ్చినట్లుగా ఊహించుకునేదాన్ని అని తెలిపింది. కానీ తన పెళ్లి వేడుకలో మాత్రం కచ్చితంగా తెలుగు సంప్రదాయలను పాటిస్తానని తెలిపింది. “ మాతృత్వాన్ని ఆస్వాదించాలని.. పెళ్లి చేసుకోవాలని ఎప్పుడూ అనుకునేదాన్ని.. అందుకు నాకు స్పష్టత ఉంది. ఎప్పుడూ అందులో నన్ను నేను చూసుకునేదాన్ని. ఇలాంటి క్షణాల్లో తెలుగుతనం ఉట్టిపడాలని భావిస్తాను.. ఎందుకంటే నా తల్లిదండ్రులు తెలుగు సంప్రదాయాలు, నా మూలాలతో నేనెప్పుడూ మమేకమయ్యే ఉన్నాను. సాధారణంగా తెలుగు పెళ్లిళ్లో అమ్మాయిలు ఎర్రటి అంచు ఉండే తెలుపు రంగు పట్టు చీర కట్టుకుంటారు. నేను కూడా అలాంటిదే ప్లాన్ చేస్తున్నాను” అంటూ చెప్పుకొచ్చింది శోభితా(Sobhita Dhulipala). అయితే పెళ్లి తేదీని మాత్రం బయటపెట్టలేదు. ఇదిలా ఉంటే ఆమె ప్రధాన పాత్రలో నటించిన లవ్ సితార సినిమా ప్రస్తుతం జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది.

Also Read : Stree 2 OTT : ఓటీటీలోకి వచ్చిన శ్రద్ధా కపూర్ ‘స్త్రీ 2’ సినిమా

CommentsNaga ChaitanyaSobhita DhulipalaTrendingViral
Comments (0)
Add Comment