Smriti Irani : నిమ్మల శంకర్ దర్శకత్వంలో వచ్చిన చిత్రం జై బోలో తెలంగాణ. ఇందులో తెలంగాణ తల్లి పాత్రను పోషించింది మాజీ మంత్రి స్మృతీ ఇరానీ. తను గతంలో బుల్లి తెరపై తళుక్కున మెరిసింది కూడా. ఎంపీగా గెలుపొంది, కేంద్ర కేబినెట్ లో కొంత కాలం పాటు పని చేశారు. ఆ తర్వాత సినీ , బుల్లి తెరకు దూరంగా ఉన్నారు.
Smriti Irani Into Web Series
తాజాగా తన గురించి కీలక అప్ డేట్ వచ్చింది. అదేమిటంటే తను తిరిగి రీ ఎంట్రీ ఇవ్వబోతోందని జోరుగా ప్రచారం జరుగుతోంది. ఆల్రెడీ నటించేందుకు గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చేసిందని వినికిడి. ఓ పేరు పొందిన సంస్థకు సంబంధించి వెబ్ సీరీస్ లో నటించనుందని టాక్. గతంలో ప్రముఖ నిర్మాత ఏక్తా కపూర్ తీసిన క్వోంకీ సాస్ భీ కభీ బహూ థీ ధారావాహిక సీరియల్ స్మృతీ ఇరానీకి(Smriti Irani) మంచి పేరు తీసుకు వచ్చేలా చేసింది.
ఇదే సీరియల్ ను వెబ్ సీరీస్ రూపొందించాలని దర్శకుడు ఆలోచిస్తున్నాడని , ఇందుకు సంబంధించి తనను సంప్రదించడంతో కథా పరంగా బాగుండడంతో స్మృతీ ఇరానీ సమ్మతి కూడా ఇచ్చేసిందని ప్రచారం. అయితే తను నటిస్తుందా లేదా అన్న విషయం గురించి ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన చేయలేదు నిర్మాణ సంస్థ కానీ ఏక్తా కపూర్ కానీ. ఎనిమిదేళ్ల పాటు సీరియల్ అత్యంత జనాదరణ పొందింది. ఆ తర్వాత ఎంపీగా పోటీ చేయడం, గెలుపొందడం..కేబినెట్ లో చోటు దక్కడంతో కొంత దూరంగా ఉంటూ వచ్చారు ఇరానీ. మొత్తంగా తను రీ ఎంట్రీ ఇవ్వబోతుండడం పట్ల సంతోషం వ్యక్తం అవుతోంది ఫ్యాన్స్ లో..
Also Read : Loveyapa Sensational : జియో హాట్ స్టార్ లో లవ్ యాపా