Smriti Biswas: బాలీవుడ్ లో విషాదం ! వెటరన్ నటి స్మృతి బిస్వాస్‌ మృతి !

బాలీవుడ్ లో విషాదం ! వెటరన్ నటి స్మృతి బిస్వాస్‌ మృతి !

Smriti Biswas: బాలీవుడ్ లో విషాదం నెలకొంది. బాలీవుడ్ వెటరన్ నటి స్మృతి బిస్వాస్‌ కన్నుమూశారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో వందో పుట్టినరోజు జరుపుకున్న బుధవారం అర్థరాత్రి తుదిశ్వాస విడిచారు. వయోభారం, అనారోగ్యంతో ఆమె మరణించినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని ప్రముఖ బాలీవుడ్ నిర్మాత హన్సల్‌ మెహతా సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. స్మృతి బిస్వాస్ మహారాష్ట్రలోని నాసిక్‌ లోని తన నివాసంలో మరణించారు. ప్రస్తుతం ఆమె నాసిక్ రోడ్ ప్రాంతంలో ఒక గదిని అద్దెకు తీసుకుని నివసిస్తోంది.

Smriti Biswas No More

స్వాతంత్య్రానికి ముందే సినిమాల్లోకి వచ్చిన ఆమె హిందీ, మరాఠీ, బెంగాలీ చిత్రాల్లో నటించింది. చైల్డ్ ఆర్టిస్ట్‌ గా తన కెరీర్‌ను ప్రారంభించిన స్మృతి బిస్వాస్(Smriti Biswas)… గురుదత్, వి శాంతారామ్, మృణాల్ సేన్, బిమల్ రాయ్, బీఆర్ చోప్రా, రాజ్ కపూర్‌ లాంటి నిర్మాతలతో సినిమాలు చేసింది. అంతే కాకుండా స్మృతి దేవ్ ఆనంద్, కిషోర్ కుమార్, బాల్ రాజ్ సాహ్ని లాంటి అగ్ర నటుల సరసన నటించింది.

స్మృతి బిస్వాస్‌ మొదట బెంగాలీ చిత్రం సంధ్య (1930)తో సినీ ప్రపంచంలోకి అడుగుపెట్టింది. చివరిసారిగా మోడల్ గర్ల్ (1960) చిత్రంలో కనిపించిన నటి… బాప్‌ రే బాప్, చాందినీ చౌక్, ఢిల్లీకా థగ్‌, జాగ్తే రహో, సైలాబ్, అబే హయాత్ లాంటి సినిమాల్లో నటించింది. ఆ తర్వాత సినీ నిర్మాత ఎస్‌డి నారంగ్‌ని పెళ్లి చేసుకున్న ఆమె.. అనంతరం నటనకు స్వస్తి చెప్పింది. భర్త చనిపోవడంతో నాసిక్‌కు వెళ్లిపోయిన స్మృతి బిస్వాస్‌కు ఇద్దరు కుమారులు సంతానం ఉన్నారు.

Also Read : Mirzapur 3 OTT : మరికొన్ని గంటల్లో ఓటీటీలోకి రానున్న ‘మీర్జాపూర్ 3’

BollywoodSmriti Biswas
Comments (0)
Add Comment