Skanda Movie Song : దుమ్ము రేపిన రామ్..రౌటేలా

స్కంద మూవీలో సాంగ్ సూప‌ర్

టాలీవుడ్ లో మినిమం డైరెక్టర్ గా పేరుంది బోయ‌పాటి శ్రీ‌నుకు. త‌ను బాల‌కృష్ణ‌తో తీసిన చిత్రం బ్లాక్ బ‌స్ట‌ర్ గా నిలిచింది. ఫైట్స్ , సెంటిమెంట్, సాంగ్స్ , డైలాగుల‌కు పెట్టింది పేరు బోయపాటి. ఇక త‌న‌లాంటి డైన‌మిక్ ద‌ర్శ‌కుడికి ఫుల్ ఎన‌ర్జీ క‌లిగిన రామ్ పోతినేని లాంటి హీరో దొరికితే ఇంకేముంది ఫ్యాన్స్ పిచ్చెక్కి పోవాల్సిందే.

త‌ను ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన స్కంధ మూవీపై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. సినిమాకు సంబంధించి రిలీజ్ చేసిన క‌ల్ట్ మామ పాట నెట్టింట్లో వైర‌ల్ గా మారింది. యూట్యూబ్ లో ట్రెండింగ్ లో కొన‌సాగుతోంది.
ఈ పాట‌ను మ‌రింత ఎన‌ర్జ‌టిక్ గా తీశాడు బోయ‌పాటి శ్రీ‌ను.

క‌ల్ట్ మామ‌లో రామ్ పోతినేనితో పాటు ఊర్వ‌శి రూటేలా న‌టించింది. ఇక స్కంద చిత్రానికి ఎప్ప‌టి లాగే ఎస్ఎస్ థ‌మ‌న్ మ్యూజిక్ అందించాడు. ఇందులో అందాల ముద్దుగుమ్మ శ్రీ‌లీల కూడా న‌టించింది. క‌ల్ట్ మామ పాట‌ను అనంత శ్రీ‌రామ్ రాశారు. హేమ చంద్ర , ర‌మ్య బెహ‌రా, మాహా పాడారు.

Comments (0)
Add Comment