TOP Movies 2024 : 2024లో టాప్ మూవీస్ రిలీజ్

రానున్న ఆరు సినిమాలు

TOP Movies 2024 : వ‌చ్చే ఏడాది 2024లో ప్ర‌ముఖ న‌టులు న‌టించిన సినిమాలు విడుద‌ల కానున్నాయి. ఇందులో కొన్ని సెంటిమెంట్ ఆధారంగా , మ‌రికొన్ని తాము నిర్దేశించుకున్న తేదీల‌ను కూడా ఖ‌రారు చేశాయి. దిగ్గ‌జ ద‌ర్శ‌కుడు త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్ ద‌ర్శ‌క‌త్వంలో ప్రిన్స్ మ‌హేష్ బాబు, శ్రీ‌లీల న‌టించిన గుంటూరు కారం రానుంది. 12 జ‌న‌వ‌రిన విడుద‌ల చేస్తామ‌ని ప్ర‌క‌టించారు మూవీ మేక‌ర్స్.

TOP Movies 2024 Viral

క్రియేటివ్ డైరెక్ట‌ర్ సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) న‌టిస్తున్న పుష్ప -2 కూడా వ‌చ్చే ఏడాది రానుంది. ఈ చిత్రాన్ని సీక్వెల్ గా తీస్తున్నాడు ద‌ర్శ‌కుడు. 22 మార్చిన రిలీజ్ చేయ‌నున్నారు. ఇదిలా ఉండ‌గా పుష్ప చిత్రానికి సంబంధించి బ‌న్నీకి జాతీయ స్థాయిలో ఉత్త‌మ న‌టుడి అవార్డు ద‌క్కించుకున్నాడు.

ఇక దేవ‌ర చిత్రం కూడా 2024న రానుంది. 5 ఏప్రిల్ లో విడుద‌ల చేస్తామ‌ని తెలిపారు మూవీ మేక‌ర్స్ . త‌మిళ సినిమాకు సంబంధించి కంగువ చిత్రం రానుంది. 11 ఏప్రిల్ డేట్ ఫిక్స్ కూడా ఖ‌రారు చేసిన‌ట్లు చిత్ర నిర్మాత‌లు. ఇదే స‌మ‌యంలో దే కాల్ హిమ్ ఓజీ ఏప్రిల్ 26న రానుంది. దీంతో పాటు క‌ల్కి చిత్రం 9 మే న విడుద‌ల కానుంది.

Also Read : MM Keeravani : సంగీతానికి కేరాఫ్ కీర‌వాణి

six top-movies-release in 2024
Comments (0)
Add Comment