Amaran : అయలాన్ వంటి సూపర్ హిట్ చిత్రం తర్వాత తమిళ స్టార్ హీరో శివకార్తికేయన్ నటిస్తున్న చిత్రం అమరన్. సాయి పల్లవి కథానాయిక. రాజ్‌కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ & సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్ప్ సంయుక్తంగా నిర్మించగా రాజ్‌కుమార్ పెరియసామి రచన, దర్శకత్వం చేశారు.
Amaran Movie Updates
కాశ్మీర్ నేపథ్యంలో శివ్ అరూర్, రాహుల్ సింగ్ రాసిన “ఇండియాస్ మోస్ట్ ఫియర్‌లెస్” అనే పుస్తకంలోని “మేజర్ వరదరాజన్” చాప్టర్ ఆధారంగా యాక్షన్ ఎమోషనల్ డ్రామాగా ఈ చిత్రాన్ని రూపొందించారు. మునుపెన్నడూ చూడని అవతార్, ఇంటెన్స్ క్యారెక్టర్‌లో శివకార్తికేయన్ కనిపించబోతున్నారు.
జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తుండగా ప్రొడక్షన్ డిజైనర్ రాజీవ్, సినిమాటోగ్రాఫర్ సిహెచ్ సాయి, ఎడిటర్ ఆర్. కలైవానన్, అన్బరివ్ మాస్టర్స్‌తో పాటు స్టీఫన్ రిక్టర్ యాక్షన్ డైరెక్టర్లుగా ఉన్నారు. అయితే ఈ సినిమాను దీపావళి పండుగ సందర్భంగా అక్టోబర్ 31న ఈ అమరన్ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు మేకర్స్ ప్రకటించారు.
Also Read : Samantha Ruth Prabhu : చాలారోజుల తర్వాత ఓ శుభవార్త చెప్పిన సమంత