Amaran : కోలీవుడ్ హీరో శివకార్తికేయన్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం అమరన్(Amaran). ఇందులో సాయి పల్లవి కథానాయికగా నటించగా.. డైరెక్టర్ రాజ్ కుమార్ పెరియసామి దర్శకత్వం వహించారు. దీపావళి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్ అయ్యింది. మేజర్ ముకుంద్ వరదరాజన్ జీవితం ఆధారంగా రూపొందించిన ఈ సినిమా థియేటర్లలో ఘన విజయం సాధించింది. ఇందులో ముకుంద్ పాత్రలో శివకార్తికేయన్, అతడి భార్య ఇందు రెబెకా వర్గీస్ పాత్రలో సాయి పల్లవి నటించగా.. వీరిద్దరి యాక్టింగ్ పై సినీ విమర్శకులు సైతం ప్రశంసలు కురిపించారు. ఈ సినిమా ఎప్పుడెప్పుడు ఓటీటీలోకి వస్తుందా అని అడియన్స్ ఎంతో ఆసక్తిగా వెయిట్ చేశారు. తాజాగా వారి ఎదురుచూపులకు ఫుల్ స్టాప్ పెడుతూ.. ఈ సినిమా ఓటీటీ విడుదల తేదీని అధికారికంగా ప్రకటించారు మేకర్స్.
Amaran Movie OTT Updates
ఈ సినిమాను డిసెంబర్ 5 నుంచి స్ట్రీమింగ్ చేయనున్నట్లు ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ ప్రకటించింది. తమిళంతోపాటు తెలుగు, మలయాళం, కన్నడ, హిందీ భాషలలో ఈ సినిమా స్ట్రీమింగ్ కానున్నట్లు వెల్లడిస్తూ ఓ పోస్టర్ రిలీజ్ చేసింది. దాదాపు 120కోట్ల బడ్జెట్ తో నిర్మించిన ఈ సినిమా రూ.325 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. థియేటర్లలో విడుదలైన నెల రోజుల తర్వాత ఇప్పుడు ఓటీటీలోకి రాబోతుంది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా రూ.325 కోట్ల గ్రాస్.. 160 కోట్లకు షేర్ వసూళ్లను రాబట్టినట్లు సమాచారం.ముకుంద్ వరదరాజన్.. చిన్నతనం నుంచే సైనికుడు కావాలని కలలు కంటాడు. లెఫ్టినెట్ కల్నల్ ఉద్యోగానికి ఎంపిక అవుతాడు. కాలేజీలో చదువుతున్న సమయంలోనే ఇందు రెబెకా వర్గీస్ (సాయి పల్లవి)ని ప్రేమిస్తాడు. ఆర్మీలో జాబ్ కావడంతో ఇందు కుటుంబసభ్యులు పెళ్లికి అభ్యంతరం చెబుతారు. కానీ పెద్దలను ఒప్పించి ముకుంద్, రెబెకా ఎలా ఒక్కటయ్యారు ?, ముకుంద్ వరదరాజన్ జీవితం, ఉద్యోగంలో ఎలాంటి ఆపరేషన్లను నిర్వహించాడనేది సినిమా. ఈ మూవీ డిసెంబర్ 5 నుంచి స్ట్రీమింగ్ కానుంది.
Also Read : Manchu Vishnu Meet : మంత్రి నారా లోకేష్ తో భేటీ అయిన మంచు విష్ణు