Sivakarthikeyan: ఇండియన్ ఆర్మీలో మేజర్ ముకుంద్ వరదరాజన్ నిజ జీవిత ఘటనల నేపథ్యంలో రాహుల్ సింగ్, శివ్ అరూర్ రాసిన ‘ఇండియాస్ మోస్ట్ ఫియర్‌లెస్’ పుస్తకం అధారంగా తెరకెక్కిస్తున్న సినిమా ‘అమరన్’. రాజ్ కుమార్ పెరియసామి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో కోలీవుడ్ స్టార్ హీరో శివకార్తికేయన్(Sivakarthikeyan), సాయి పల్లవి జంటగా నటిస్తున్నారు. స్టార్ కంపోజర్ జివి ప్రకాష్ మ్యూజిక్ అందిస్తున్నారు. అడవి శేష్ హీరోగా తెరకెక్కించిన ‘మేజర్’ సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన హాలీవుడ్ నిర్మాణ సంస్థ సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్, కమల్ హాసన్ కు చెందిన రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు… వకీల్ ఖాన్ గాడ్ బ్లెస్ ఎంటర్‌టైన్ మెంట్ సహ నిర్మాతగా వ్యవహరిస్తోంది. అయితే శివ కార్తికేయన్ పుట్టిన రోజు సందర్భంగా టైటిల్ టీజర్ ను చిత్ర యూనిట్ విడుదల చేసింది.
Sivakarthikeyan Movie updates
మేజర్ ముకుంద్ వరదరాజన్ నిజ జీవితం ఆధారంగా తెరకెక్కిస్తున్న ఈ సినిమాకు సంబంధించి విడుదల చేసిన టైటిల్ టీజర్ అభిమానులు విశేషంగా ఆకట్టుకుంటోంది. మేజర్ ముకుంద్ వరదరాజన్ గా శివ కార్తికేయన్ లుక్… టైటిల్ టీజర్ కు స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలుస్తోంది. కమల్ హాసన్ కు చెందిన రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ పతాకంపై 51వ సినిమా వస్తున్న ‘అమరన్’ షూటింగ్ చివరి దశలో ఉండగా…. 2024 వేసవిలో ప్రేక్షకులముందుకు రాబోతుంది.
Also Read : Suhani Bhatnagar : 19 ఏళ్లకే దంగల్ నటి సుహాని భట్నాగర్ మృతి