Ayalaan: “అయలాన్” మార్నింగ్ షో రద్దు

తెలుగులో “అయలాన్” మార్నింగ్ షోస్ రద్దు !

తెలుగులో “అయలాన్” మార్నింగ్ షోస్ రద్దు !

కోలీవుడ్ టాలెంటెడ్ హీరో శివ కార్తికేయన్‌, రకుల్ ప్రీత్ సింగ్ ప్రధాన పాత్రల్లో ఆర్‌ రవికుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కించిన తాజా సినిమా ‘అయలాన్‌’. కోటపాడి జె. రాజేశ్‌ నిర్మించిన ఈ సై ఫై థ్రిల్లర్… సంక్రాంతి కానుకగా తమిళనాడులో జనవరి 12న విడుదలై బాక్సాఫీసు వద్ద ఘన విజయం సాధించింది. అయితే అనివార్య కారణాల వలన తెలుగులో జనవరి 26న విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. దీనితో రిపబ్లిక్ డే సందర్భంగా విడుదల అవుతున్న ఈ సినిమాకు ఆన్ లైన్ బుకింగ్స్ కూడాప్రారంభమయ్యాయి.

 

అయితే మార్నింగ్ షోకు టిక్కెట్లు బుక్ చేసుకున్న తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులకు షాక్ ఇచ్చింది చిత్ర యూనిట్. పలు కారణాల చేత శుక్రవారం ఉదయం తెలుగు రాష్ట్రాల్లో మార్నింగ్ షోను రద్దు చేసింది. దీనితో ఆల్రెడీ టికెట్స్ బుక్ చేసుకున్న వారికి వారి సంబంధిత సినిమా టికెట్ బుకింగ్ సంస్థలు క్షమాపణలు తెలిపి డబ్బులు వెనక్కి పంపిస్తున్నారు. దీనితో ఈ సినిమా కోసం ఎదురు చూసిన ఆడియెన్స్ అయితే డిజప్పాయింట్ అవుతున్నారు.

తమిళంతో పాటు దక్షిణాది భాషల్లో వచ్చిన తొలి ఫ్యాంటసీ సైన్స్‌ ఫిక్షన్‌ చిత్రం ‘అయలాన్‌’. తమిళంలో అయలాన్‌ అంటే ఇంగ్లీషులో ఏలియన్‌. తెలుగులో గ్రహాంతర వాసి. ఈ సినిమాలో కేవలం వీఎఫ్‌ఎక్స్‌ షాట్స్‌కి సుమారు రెండేళ్లు పట్టింది. 2016లో ఈ సినిమా ప్రకటించినప్పటికీ వివిధ కారణాలతో నిర్మాణంతో పాటు విడుదలలో తీవ్ర జాప్యం జరిగింది. ఈ నేపథ్యంలో ఈ సినిమా పూర్తి చేయడం కోసం నిర్మాత ఎదుర్కొన్న ఆర్ధిక ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని హీరో శివకార్తికేయన్ తన పారితోషకాన్ని వదులుకున్నట్లు గతంలో ప్రకటించారు. అయితే సంక్రాంతి కానుకగా తమిళనాట రిలీజ్ అయిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ సాధించి కేవలం నాలుగు రోజుల్లోనే రూ. 50 కోట్లు వసూలు చేసింది. ఇషా కొప్పికర్‌, శరత్‌ కేల్కర్‌, భానుప్రియ, యోగిబాబు, కరుణాకరన్‌, బాల శవరణన్‌ తదితరులు నటించారు.

AyalaanSivakarthikeyan
Comments (0)
Add Comment