Sivakarthikeyan: కోలీవుడ్ స్టార్ హీరో శివకార్తికేయన్ కు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. సినిమా ఇండస్ట్రీలోని అడుగుపెట్టకముందే ఆర్తి అనే యువతిని పెళ్లి చేసుకున్న ఈ యువ హీరో… ఇప్పటికే వీరికి అరాధన, గుగన్ దాస్ అనే ఓ పాప, బాబు ఉన్నారు. అయితే ఇటీవల ఓ అభిమాని ఇంట్లో బర్త్ డే వేడుకకు సతీ సమేతంగా హాజరయిన శివకార్తికేయన్ కు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. దీనికి కారణం శివకార్తికేయన్ భార్య ఆర్తికి పొట్ట కాస్తా ఎక్కువగా కనిపించడం. వీడియోలో ఆర్తి పొట్టను చూసిన వారంతా ఇదీ బేబీ బంప్ అంటూ… త్వరలో శివకార్తికేయన్ మరో జూనియర్ శివకార్తికేయన్ ను ఇస్తున్నారంటూ కామెంట్లు పెడుతున్నారు. చాలాకాలం తర్వాత వీరు మూడో బిడ్డ కోసం ప్లాన్ చేసారంటూ సోషల్ మీడియాలో పుకార్లు షికార్లు చేస్తున్నాయి.
Sivakarthikeyan…
హీరో శివకార్తికేయన్ ఇండస్ట్రీలో అడుగుపెట్టకముందే 2010లో ఆర్తిని పెళ్లి చేసుకున్నారు. వీరికి 2013లో కూతురు ఆరాధన, 2021లో కుమారుడు గుగన్ దాస్ జన్మించారు. శివకార్తికేయన్(Sivakarthikeyan) హీరో మాత్రమే కాకుండా సింగర్ అన్న విషయం తెలిసిందే. ఆ మధ్య ఆరాధాన సైతం కనా అనే కన్నడ మూవీలో వాయడి పేట పుల్ల అనే సాంగ్ ఆలపించి సెన్సేషన్ అయింది. ఇక శివకార్తికేయన్ సినిమాల విషయానికి వస్తే అతడు నటించిన అమరన్ సినిమా రిలీజ్‌కు రెడీ అవుతోంది. ఇందులో అతడు మేజర్ ముకుంద్ వరదరాజన్‌గా కనిపించనున్నాడు. తర్వాత ఏఆర్ మురుగదాస్‌తో ఓ చిత్రం చేయనున్నాడు.
Also Read : Harom Hara: మహేష్ బాబు చేతుల మీదుగా ‘హరోం హర’ ట్రైలర్ విడుదల !