Sivakarthikeyan : మన జీవితంలో వచ్చే సమస్యలు కూడా చెన్నై వరదాల్లాంటివే..

ఆమె వెంటనే ‘థ్యాంక్యూ బ్రో’ అని చెప్పింది...

Sivakarthikeyan : జీవితాల్లో వచ్చే సమస్యలు చెన్నై వర్షాల్లాంటివని, మనం సిద్ధంగా ఉన్నపుడు అవి రావని, సరదాగా ఉన్నపుడు ముంచెత్తుతాయని అలాంటి సమయంలో బయటపడేందుకు పోరాటం చేయకతప్పదని హీరో శివకార్తికేయన్‌(Sivakarthikeyan) అన్నారు. ఆయన హీరోగా నటించిన కొత్త చిత్రం ‘అమరన్‌’. అగ్రనటుడు కమల్ హాసన్‌ నిర్మాతగా రాజ్‌కమల్‌ ఫిల్మ్‌ ఇంటర్నేషనల్‌ పతాకంపై వీరమరణం పొందిన భారత సైనికుడు, దివంగత మేజర్‌ ముకుంద్‌ వరదరాజన్‌ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కించారు. రాజ్‌కుమార్‌ పెరియస్వామి దర్శకుడు. సాయిపల్లవి హీరోయిన్‌. సంగీతం జీవీ ప్రకాష్‌ కుమార్‌ అందించారు. ఈ చిత్ర ఆడియో రిలీజ్‌ వేడుక తాజాగా చెన్నైలో జరిగింది.

Sivakarthikeyan Comment

ఈ సందర్భంగా హీరో శివకార్తికేయన్‌(Sivakarthikeyan) మాట్లాడుతూ… ‘‘రెండేళ్ల క్రితం ‘ప్రిన్స్‌’ చిత్రం విడుదలై నిరుత్సాహానికి గురి చేసింది. అప్పుడు నిరాశలో కూరుకునిపోయా. ఓ రోజున హీరో అజిత్‌ను కలిశా. నా చెయ్యి పట్టుకుని చాలా మంది నీ ఎదుగుదలను చూసి అభద్రతాభావంతో ఉన్నారంటే నువ్వు పురోగమిస్తున్నావని అర్థం అని అన్నారు. ఆ మాటలు నాకు బూస్ట్‌లా పనిచేశాయి. మేజర్‌ ముకుంద్‌ కథను దర్శకుడు వివరించినపుడు భావోద్వేగానికి గురయ్యా. వంద రోజుల పాటు కశ్మీర్‌లో యాక్షన్‌ సన్నివేశాలు చిత్రీకరించాం. ఈ సినిమా క్లైమాక్స్‌ ప్రతి ఒక్కరినీ కంటతడి పెట్టిస్తుంది. ఓ టీవీ చానెల్‌లో పనిచేస్తున్నపుడు సాయిపల్లవిని తొలిసారి కలిశా. ఇండస్ట్రీలో ఆమె పేరే ఒక బ్రాండ్‌. ‘ప్రేమమ్‌’లో ఆమె నటనకు ఫిదా అయ్యా. ఫోన్‌ చేసి ప్రశంసించా.

ఆమె వెంటనే ‘థ్యాంక్యూ బ్రో’ అని చెప్పింది. నన్ను అన్నా అని పిలిచినందుకు అపుడు చాలా ఫీలయ్యా. ఆమె గొప్ప నటి’’ అన్నారు.అతిథిగా హాజరైన దర్శకుడు లోకేష్‌ కనకరాజ్‌ మాట్లాడుతూ.. ఈ సినిమా చూసి దేశమంతా గర్వపడుతుంది. కమల్‌ సార్ చూసి తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారని తెలుపగా.. సంచలన దర్శకుడు మణిరత్నం మాట్లాడుతూ.. ముకుంద్‌ వంటి గొప్ప వ్యక్తుల గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. నేను సాయిపల్లవికి పెద్ద అభిమానిని. భవిష్యత్‌లో ఆమెతో కలిసి పని చేయాలని కోరుకుంటున్నానని అన్నారు. హీరోయిన్‌ సాయిపల్లవి మాట్లాడుతూ.. ఈ సినిమా హీరోగా శివకార్తికేయన్‌ సరైన ఎంపిక అని అన్నారు. అలాగే, చిత్ర దర్శకుడు రాజ్‌కుమార్‌, సంగీత దర్శకుడు జీవీ ప్రకాష్‌ తదితరులు ప్రసంగించారు.

Also Read : War 2 Movie : ‘వార్ 2’ సినిమా తెలుగు కోసం నయా టైటిలా..

CommentsSivakarthikeyanTrendingUpdatesViral
Comments (0)
Add Comment