Sivakarthikeyan: జనవరి 26న వస్తున్న శివకార్తికేయన్ ‘అయలాన్‌’ !

జనవరి 26న వస్తున్న శివకార్తికేయన్ ‘అయలాన్‌’ !

Sivakarthikeyan: శివ కార్తికేయన్‌, రకుల్ ప్రీత్ సింగ్ ప్రధాన పాత్రల్లో ఆర్‌ రవికుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కించిన తాజా సినిమా ‘అయలాన్‌’. కోటపాడి జె. రాజేశ్‌ నిర్మించిన ఈ సినిమా… సంక్రాంతి కానుకగా తమిళనాడులో జనవరి 12న విడుదలై బాక్సాఫీసు వద్ద ఘన విజయం సాధించింది. శివ కార్తికేయన్‌(Sivakarthikeyan) నటన, కామెడీ, సినిమా కాన్సెప్ట్‌ తమిళ ప్రేక్షకుల్ని ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఏఆర్‌ రెహమాన్‌ పాటలు, నేపథ్య సంగీతం చిత్రానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. విడుదలైన నాలుగు రోజుల్లోనే యాభై కోట్ల రూపాయలకు పైగా వసూలు చేసి… బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. తమిళనాట బ్లాక్ బస్టర్ గా నిలిచిన ఈ ఫాంటసీ సైన్స్‌ ఫిక్షన్‌ మూవీను… జనవరి 26న తెలుగులో విడుదల చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. గంగ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సంస్థ తెలుగులో ఈ సినిమాను విడుదల చేస్తుంది.

Sivakarthikeyan Movie Updates

తమిళంతో పాటు దక్షిణాది భాషల్లో వచ్చిన తొలి ఫ్యాంటసీ సైన్స్‌ ఫిక్షన్‌ చిత్రం ‘అయలాన్‌’. తమిళంలో అయలాన్‌ అంటే ఇంగ్లీషులో ఏలియన్‌. తెలుగులో గ్రహాంతర వాసి. ఈ సినిమాలో కేవలం వీఎఫ్‌ఎక్స్‌ షాట్స్‌కి సుమారు రెండేళ్లు పట్టింది. 2016లో ఈ సినిమా ప్రకటించినప్పటికీ వివిధ కారణాలతో నిర్మాణంతో పాటు విడుదలలో తీవ్ర జాప్యం జరిగింది. ఈ నేపథ్యంలో ఈ సినిమా పూర్తి చేయడం కోసం నిర్మాత ఎదుర్కొన్న ఆర్ధిక ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని హీరో శివకార్తికేయన్ తన పారితోషకాన్ని వదులుకున్నట్లు గతంలో ప్రకటించారు. అయితే సంక్రాంతి కానుకగా తమిళనాట రిలీజ్ అయిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ సాధించి కేవలం నాలుగు రోజుల్లోనే రూ. 50 కోట్లు వసూలు చేసింది. ఇషా కొప్పికర్‌, శరత్‌ కేల్కర్‌, భానుప్రియ, యోగిబాబు, కరుణాకరన్‌, బాల శవరణన్‌ తదితరులు నటించారు.

Also Read : Janhvi Kapoor: సూర్య సరసన జాన్వీ కపూర్ ?

AyalaanSivakarthikeyan
Comments (0)
Add Comment