Siva Balaji: యూట్యూబర్‌పై కేసు పెట్టిన శివబాలాజీ !

యూట్యూబర్‌పై కేసు పెట్టిన శివబాలాజీ !

Siva Balaji: పలువురు నటీనటులను ఉద్దేశించి నెగెటివ్‌ ట్రోల్స్‌ చేస్తున్న యూట్యూబర్‌ విజయ్‌ చంద్రహాసన్‌ పై నటుడు, ‘మా’ కోశాధికారి శివ బాలాజీ హైదరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌కు ఫిర్యాదు చేశారు. సినీ నటీనటులను టార్గెట్‌ చేస్తూ నిత్యం నెగెటివ్‌ ట్రోల్స్‌ చేస్తున్న యూట్యూబర్‌ విజయ్‌ చంద్రహాసన్‌ అనే వ్యక్తిపై హైదరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌లో శివ బాలాజీ ఫిర్యాదు చేశారు. నటీనటులను.. మరీ ముఖ్యంగా నటుడు మంచు విష్ణు, ఆయన నిర్మాణ సంస్థ గురించి విపరీతంగా ట్రోల్స్‌ చేస్తున్నాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. చిత్రపరిశ్రమలో భాగమైన మూవీ ఆర్టిస్ట్ అసోసియేషషన్‌ కు ఉన్న గౌరవాన్ని దెబ్బతీసేలా పలు వీడియోలు క్రియేట్‌ చేశాడని శివ బాలాజీ(Siva Balaji) పేర్కొన్నారు. దీనికి సంబంధించిన వీడియో లింక్స్‌ను పోలీసులకు అందజేశారు. ఈ మేరకు పోలీసులు యూట్యూబర్‌పై కేసు నమోదు చేశారు. దర్యాప్తు చేపట్టారు. యూట్యూబర్‌కు నోటీసులు పంపించారు.

Siva Balaji Complaint..

చిత్రపరిశ్రమలోని నటీనటులతో పాటు వారి కుటుంబసభ్యులను టార్గెట్‌ చేస్తూ వ్యక్తిగతంగా ట్రోల్స్‌ చేస్తున్నవారిపై ఇప్పటికే కేసులు నమోదయ్యాయి. ఈ విషయంలో మా అధ్యక్షులు మంచు విష్ణు పలు సంచలన నిర్ణయాలు తీసుకున్నారు. ఈ క్రమంలో తాజాగా నటుడు, ‘మా’ కోశాధికారి శివ బాలాజీ పోలీసులను ఆశ్రయించారు. కొద్దిరోజుల క్రితం సుమారు 18కి పైగా యూట్యూబ్‌ ఛానళ్లను రద్దు చేస్తున్నట్లు మంచు విష్ణు ప్రకటించిన విషయం తెలిసిందే. యూట్యూబర్స్‌లో మార్పు రాకుంటే వారిపై మరింత కఠనమైన నిర్ణయాలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. మంచు విష్ణు నిర్ణయానికి సీనియర్ నటి మీనా సహా పలువురు సినీ ప్రముఖులు మద్దత్తు ఇచ్చిన సంగతి తెలిసిందే.

Also Read : Emergency: ఎట్టకేలకు సెన్సార్‌ పూర్తి చేసుకున్న కంగనా రనౌత్‌ ‘ఎమర్జెన్సీ’ !

Cyber CrimeMAAManchu VishnuSiva Balaji
Comments (0)
Add Comment