Sitara : అనంత్ అంబానీ పెళ్లి వేడుకల్లో స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచిన మహేష్ కూతురు

ముఖ్యంగా ఈ పెళ్లి వేడుకలో మ‌హేశ్ కుటుంబం స్పెష‌ల్ అట్రాక్ష‌న్‌గా నిలిచింది...

Sitara : అపర కుబేరుడు అనంత్ అంబానీ, రాధిక మర్చెంట్ ల వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. శుక్రవారం (జులై 12) వైవాహిక బంధంలోకి అడుగపెట్టారు అనంత్ అంబానీ, రాధిక మర్చెంట్. ముంబైలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్ వేదికగా జరిగిన ఈ వేడుకకు అతిరథ మహారథులు తరలివచ్చారు. హాలీవుడ్, బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్.. ఇలా అన్ని సినీ రంగాల ప్రముఖులు అనంత్ అంబానీ వేడుకకు హాజరయ్యారు. ఇక టాలీవుడ్ నుంచి మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్‌చ‌రణ్‌, సూప‌ర్ స్టార్ మ‌హేశ్ బాబులు కుటుంబ స‌మేతంగా అనంత్ అంబానీ పెళ్లికి హాజరయ్యారు.

Sitara Viral

ముఖ్యంగా ఈ పెళ్లి వేడుకలో మ‌హేశ్ కుటుంబం స్పెష‌ల్ అట్రాక్ష‌న్‌గా నిలిచింది. కూతురు సితార, భార్య నమ్రతా శిరోద్కర్‌తో కలిసి మ‌హేశ్ ఈ పెళ్లి వేడుక‌లో సంద‌డి చేశాడు. ఇక మ‌హేశ్ గారాల ప‌ట్టి సితార ప‌లువురు హాలీవుడ్, బాలీవుడ్ సెల‌బ్రిటీల‌తో ఫోటోలు దిగింది. ఇందుకు సంబంధించిన ఫోటోల‌ను త‌న సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేసింది. కిమ్ కర్దాషియన్, ఐశ్వర్యారాయ్, రేఖ, ప్రియాంకా చోప్రా, కియారా అద్వానీ, రణ్ వీర్ సింగ్.. తదితర నటీనటులతో సితార దిగిన ఫొటోలు ఇప్పుడు నెట్టింట వైరలవుతున్నాయి.

Also Read : Mandakini OTT : ఓటీటీలోకి రానున్న తమిళ కామెడీ థ్రిల్లర్ ‘మందాకినీ’

SitaraTrendingUpdatesViral
Comments (0)
Add Comment