Sitara Ghattamaneni : నీట్ టాప్ స్కోర్ పేద విద్యార్థులకు సాయం అందించిన సితార

అలాగే పేద విద్యార్థినులకు సైకిళ్లు అందజేయడం, బహుమతులు ఇవ్వడం....

Sitara Ghattamaneni : టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు గారాల పట్టి సితార ఘట్టమనేని క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సినిమాల్లోకి రాకపోయినా ఇప్పటికే తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుందీ స్టార్ కిడ్. ఓ బ్రాండెడ్ నగల కంపెనీ ప్రమోషన్ యాడ్ లో నటించిన సితార(Sitara Ghattamaneni) మ మహేశ్ బాబు నటించిన సర్కారు వారి పాట సినిమాల్లో తళుక్కున మెరిసింది. ఇక సేవా కార్యక్రమాల్లోనూ తండ్రి మహేశ్ బాబు అడుగు జాడల్లోనే నడుస్తోంది సితార. ఇందులో భాగంగానే తనకు వచ్చిన రెమ్యునరేషన్ ను సైతం సేవా కార్యక్రమాలకు వెచ్చించింది.

Sitara Ghattamaneni Helps

అలాగే పేద విద్యార్థినులకు సైకిళ్లు అందజేయడం, బహుమతులు ఇవ్వడం.. ఇలా పలు సందర్భాల్లో తన గొప్ప మనసు చాటుకుంది మహేశ్ బాబు కూతురు. ఇప్పుడు తన పుట్టిన రోజు సందర్భంగా మెడిసిన్‌ చదవాలనుకున్న ఒక పేద విద్యార్థినికి ఆర్థిక సాయం చేసి అండగా నిలిచింది. 2024లో జరిగిన మెడికల్ ఎంట్రెన్స్ ఎగ్జామ్ నీట్ పరీక్షలో నవ్యశ్రీ అనే అమ్మాయి 605 మార్కులు సాధించింది. ఒక సాధారణ కళాశాలలోనే చదివిన ఆమె తన ప్రతిభతో టాప్ స్కోర్ సాధించింది. ప్రభుత్వ మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ సీటు సాధించింది. అయితే పేదరికం ఆమె కలలకు అడ్డుగా నిలిచింది. కనీసం పుస్తకాలు, హాస్టల్‌ ఫీజు, కనీస కాలేజీ ఫీజులు కూడా చెల్లిచలేని స్థితిలో నవ్య కుటుంబం ఉంది. దీంతో ‘నా చదువకు సాయం చేయాలి’ అంటూ మహేష్ బాబు ఫౌండేషన్, సూపర్ స్టార్ కృష్ణ ఎడ్యుకేషనల్ ట్రస్ట్‌ను నవ్య సంప్రదించింది.

నవ్యశ్రీ వైద్య విద్య కలలకు మహేష్ బాబు ఫౌండేషన్ ఊపిరి పోసింది. ఆమెకు రూ. 1,25,000 చెక్కుతో పాటు తన మెడిసిన్‌ విద్య పూర్తి అయ్యే వరకు తమ సంస్థ నుంచే డబ్బు అందుతుందని మహేశ్ ఫ్యామిలీ హామీ ఇచ్చింది. ఇక సితార(Sitara Ghattamaneni) తన పుట్టినరోజును కూడా నవ్యశ్రీతో సెలబ్రేట్ చేసుకుని ఆమె కళ్లల్లో మరింత ఆనందాన్ని నింపింది. ఈ విషయాన్ని సితార తల్లి నమ్రత శిరోద్కర్‌ తన సోషల్ మీడియా ద్వారా అందరితో పంచుకున్నారు. ‘ దినసరి కూలీ తన కూతురు నవ్యశ్రీని చదివించేందుకు శక్తివంచన లేకుండా శ్రమించాడు. తండ్రి కష్టాన్ని అర్థం చేసుకున్న కూతురు కూడా NEET పరీక్షలో పోటీ పడి మంచి మార్కులు సాధించింది. ఆమె డాక్టర్ కావడానికి అన్ని అర్హతలు ఉన్నాయి.. తన కలలను సాధించే మార్గంలో కష్టపడి చదివి విజయం సాధించింది. అయితే నవ్య కుటుంబ ఆర్థిక పరిస్థితి ఆమె కలలకు అడ్డుగా నిలిచింది’.

‘ మహేష్ బాబు ఫౌండేషన్, సూపర్ స్టార్ కృష్ణ ఎడ్యుకేషనల్ ఫండ్ ద్వారా నవ్యశ్రీకి సాయం చేసేందుకు ముందుకొచ్చింది. ఆమె మెడిసిన్ విద్యాభ్యాసం పూర్తి అయ్యే వరకు కాలేజీ, హాస్టల్‌ ఫీజులన్నీ ఇక నుంచి సూపర్ స్టార్ కృష్ణ ఎడ్యుకేషనల్ ఫండ్ అందిస్తోంది. మా లిటిల్ ప్రిన్సెస్ (సితార) తన పుట్టినరోజును కూడా నవ్యశ్రీ తో సెలబ్రేట్ చేసుకుంది. ఈ క్రమంలోనే తనను అభినందించడంతో పాటు కాబోయే డాక్టర్‌కు ల్యాప్‌టాప్, స్టెతస్కోప్‌ను బహుమతిగా ఇచ్చింది.’ అని నమ్రత తెలిపింది.

Also Read : Hero Vicky : సాండ్ మాఫియా నాపై దాడి చేసిందంటున్న ప్రముఖ బాలీవుడ్ హీరో

HelpingSitaraSuper Star Mahesh BabuTrendingUpdatesViral
Comments (0)
Add Comment