Sinners: ఆకట్టుకుంటోన్న హాలీవుడ్ హర్రర్ మూవీ “సిన్న‌ర్స్” ట్రైలర్ !

ఆకట్టుకుంటోన్న హాలీవుడ్ హర్రర్ మూవీ "సిన్న‌ర్స్" ట్రైలర్ !

Sinners: ప్రపంచ సినీ ప్రేక్ష‌కుల‌ను అల‌రించేందుకు ఓ అరుదైన జాన‌ర్ చిత్రం “సిన్న‌ర్స్(Sinners)” రెడీ అయింది. తాజాగా ఈ సినిమా ఇంగ్లీష్‌ తో పాటు తెలుగు ట్రైల‌ర్‌ను విడుద‌ల చేయ‌గా ప్రేక్ష‌కుల‌ను విశేషంగా ఆక‌ట్టుకుంటోంది. గ‌తంలో హ‌లీవుడ్‌ లో క్రీడ్‌, బ్లాక్ పాంథ‌ర్ వంటి భారీ విజ‌య‌వంత‌మైన చిత్రాల‌ను తెర‌కెక్కించిన ర్యాన్ కూగ్ల‌ర్ ఈ సినిమాకు ర‌చ‌న‌, ద‌ర్శ‌క‌త్వంతో పాటు నిర్మాత‌గాను వ్య‌వ‌హ‌రించగా వార్న‌ర్ బ్ర‌ద‌ర్స్ నిర్మాణ సంస్థ విడుద‌ల చేస్తోంది.

Sinners Movies Updates

జ‌స్టీస్ లీగ్‌, పెంటాస్టిక్ ఫోర్‌, బ్లాక్ పాంథ‌ర్‌, క్రీడ్ వంటి సినిమాల‌తో హాలీవుడ్‌లో అగ్ర క‌థానాయ‌కుల్లో ఒక‌డిగా చోటు ద‌క్కించుకున్న‌ మైఖేల్ బి. జోర్డాన్ ఈ సినిమాలో హీరోగా న‌టించ‌గా, ది మార్వెల్‌, స్పైడ‌ర్ ఉమ‌న్ పాత్ర‌ల‌తో ప్ర‌త్యేక గుర్తింపు ఉన్న‌ హైలీ స్టెయిన్‌ఫెల్డ్ క‌థానాయిక‌గా చేసింది. జాక్ ఓ’కానెల్, వున్మీ మొసాకు, జేమ్ లాసన్, ఒమర్ బెన్సన్ మిల్లర్, డెల్రాయ్ లిండో ఇత‌ర కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు.

తాజాగా మంగ‌ళ‌వారం రోజున ఈ సినిమా ఇంగ్లీష్‌తో పాటు తెలుగు ట్రైల‌ర్‌ను విడుద‌ల చేయ‌గా ప్రేక్ష‌కుల‌ను విశేషంగా ఆక‌ట్టుకుంటోంది. ఈ ట్రైల‌ర్‌ లో ముఖ్యంగా తొంద‌ర‌గా త‌లుపులు తెరిచి చావండిరా… అంటూ వ‌చ్చిన డైలాగులు సినిమాపై బ‌జ్ క్రియేట్ చేస్తున్నాయి. ఇంత‌కు ముందు చూడ‌ని త‌ర‌హా భ‌యంక‌ర‌మైన చిత్రంగా రూపొందిన ఈ మూవీ మార్చి 7, 2025న థియేట‌ర్ల‌లోకి రానుంది.

Also Read : Sudheer Babu: త్వరలో సెట్స్ పైకి సుధీర్‌ బాబు ‘జటాధర’ !

HollywoodSinnersWarner Bros Pictures
Comments (0)
Add Comment