Udit Narayan – Kissing Master : ఈ సింగ‌ర్ కిస్సింగ్ మాస్ట‌ర్

ఉదిత్ నారాయ‌ణ్ వైర‌ల్

Udit Narayan : ఈ మ‌ధ్య‌నే పుష్ప‌-2 మూవీలో శ్రీ‌లీల బ‌న్నీతో చేసిన స్పెష‌ల్ కెవ్వు కేక అనిపించేలా చేసింది. ఇక రాను రాను నాలుగు గోడ‌ల మ‌ధ్య ఉండాల్సినవ‌న్నీ ఇప్పుడు బ‌హిరంగంగానే క‌నిపిస్తున్నాయి. ఇద్ద‌రి మ‌ధ్య ఉండాల్సిన గౌర‌వం లేకుండా పోతోంది. తాజాగా పాపుల‌ర్ సింగ‌ర్ గా పేరు పొందారు బాలీవుడ్ కు చెందిన ఉదిత్ నారాయ‌ణ్(Udit Narayan). ఆయ‌న ఇత‌ర భాష‌ల్లో కూడా వంద‌లాది పాట‌లు పాడారు. త‌న‌పై గ‌తంలో ఆరోప‌ణ‌లు వ‌చ్చినా ఎవ‌రూ అంత‌గా విశ్వ‌సించ లేదు.

Udit Narayan…

తాజాగా జ‌రిగిన ఓ ఈవెంట్ సంద‌ర్బంగా చోటు చేసుకున్న ఘ‌ట‌న ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. లైవ్ కొన‌సాగుతుండ‌గానే ఫ్యాన్స్ త‌న‌తో సెల్ఫీ తీసుకునేందుకు పోటీ ప‌డ్డారు. మ‌నోడు ఇదే అవ‌కాశంగా తీసుకుని రెచ్చి పోయాడు. ఓ వైపు సెల్ఫీల‌కు ఫోజులు ఇస్తూనే మ‌రో వైపు ఓ అంద‌మైన మ‌హిళ పెదాల‌పై గ‌ట్టిగా ముద్దు పెట్టాడు.

గ‌తంలో ప్ర‌ముఖ ఫిమేల్ సింగ‌ర్స్ ఆల్కా యాగ్నిక్ , శ్రేయా ఘోష‌ల్ ల‌ను కూడా చెంప‌ల‌పై ఉదిత్ నారాయ‌ణ్ ముద్దు పెట్టాడు. ఇందుకు సంబంధించిన వీడియోలు ఇప్పుడు సోష‌ల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. ఉదిత్ నార‌య‌ణ్ ప్ర‌స్తుతం వ‌య‌సు 65 ఏళ్ల‌కు పైగానే ఉన్నాయి. ఈ వ‌య‌సులో ఆద‌ర్శంగా ఉండాల్సిన సింగ‌ర్ ఇలా కిస్సింగ్ మాస్ట‌ర్ గా మార‌డం ఏమిటి అంటూ సంగీత అభిమానులు మండి ప‌డుతున్నారు. దీనిపై ఇంకా స్పందించ లేదు ఈ సింగ‌ర్.

Also Read : Anasuya Shocking Comment:అప్పుడు వ‌ద్ద‌నుకున్నా మ‌న‌సు మార్చుకున్నా

CommentsUdit NarayanUpdatesViral
Comments (0)
Add Comment