Singer Kalpana Shocking :ఒత్తిడి త‌ట్టుకోలేకే టాబ్లెట్స్ వేసుకున్నా

ప్ర‌ముఖ సింగ‌ర్ క‌ల్ప‌న రాఘ‌వేంద్ర

Singer Kalpana : హైద‌రాబాద్ – ప్ర‌ముఖ సింగ‌ర్ క‌ల్ప‌నా రాఘ‌వేంద్ర ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. త‌ను ఎక్కువ మోతాదులో మందులు వేసుకుంది. ఆ త‌ర్వాత అప‌స్మార‌క స్థితిలోకి వెళ్లి పోయింది. రెండు రోజుల పాటు అపార్ట్మెంట్ నుంచి బ‌య‌ట‌కు రాక పోవ‌డంతో కాల‌నీ వాసులు గుర్తించి వెంట‌నే పోలీసుల‌కు స‌మాచారం అందించారు. హుటా హుటిన అక్క‌డికి చేరుకుని అచేత‌నంగా ప‌డి పోయిన సింగ‌ర్ క‌ల్ప‌న‌(Singer Kalpana)ను ప్రైవేట్ ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. గ‌త కొంత కాలంగా తీవ్ర ఇబ్బందుల్లో ఉన్న‌ట్లు స‌మాచారం.

Singer Kalpana Comment

దీంతో త‌ను భ‌ర్త‌తో వేగ‌లేక , త‌ట్టుకోలేక , ఆర్థిక ఇబ్బందుల కార‌ణంగా స్లీపింగ్ టాబ్లెట్స్ ఎక్కువ మోతాదులో తీసుకుందంటూ పెద్ద ఎత్తున ప్ర‌చారం జ‌రిగింది. దీనిపై తీవ్రంగా స్పందించారు సింగ‌ర్ క‌ల్ప‌న కూతురు ద‌యా. ఇదంతా క‌ట్టుక‌థ అని, ద‌యచేసి సూసైడ్ అటెంప్ట్ త‌న త‌ల్లి చేసుకోలేదంటూ చెప్పారు. అంతే కాదు త‌ను లాతో పాటు పీహెచ్ డీ చేసింద‌ని చెప్పారు.

త‌న త‌ల్లి ధైర్య‌వంతురాలు అని, ఆత్మ‌హ‌త్య చేసుకునేంత పిరికిది కాదంటూ పేర్కొన్నారు. ఈ మొత్తం వ్య‌వ‌హారం చ‌ర్చ‌నీయాంశంగా మార‌డంతో శుక్ర‌వారం సింగ‌ర్ క‌ల్ప‌న స్పందించింది. తన‌కు భ‌ర్త‌కు మ‌ధ్య ఎలాంటి విభేదాలు లేవ‌న్నారు. ఒత్తిడి త‌ట్టుకోలేక మాత్ర‌లు మోతాదుకు మించి వాడానంటూ చెప్పారు.

Also Read : Hanuman Sequel Shocking : హ‌నుమాన్ సీక్వెల్ ఆల‌స్యం

CommentsSinger KalpanaSuicideViral
Comments (0)
Add Comment