Kalpana : హైదరాబాద్ – ప్రముఖ గాయని కల్పన ఆత్మహత్యా యత్నానికి పాల్పడింది. ఈ ఘటన తెలుగు చలన చిత్ర రంగంలో కలకలం రేపింది. హైదరాబాద్ లోని నిజాంపేటలోని తన ఇంట్లో నిద్ర మాత్రలు మింగి అపస్మారక స్థితిలోకి వెళ్లింది. ఇది గమనించిన కల్పన(Kalpana) కుటుంబీకులు కల్పనను ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు.
Kalpana Suicide Sensational
ఇదిలా ఉండగా గాయని కల్పన గత 20 ఏళ్ల నుంచి సినీ రంగంలో ఉన్నారు. ఎన్నో విజయవంతమైన సినిమాలకు పాటలు పాడారు. దివంగత సంగీత దర్శకుడు చక్రి ఉన్నంత వరకు కల్పనకు ఎక్కువగా ప్రయారిటీ ఇచ్చారు. సూపర్ సాంగ్స్ ఆమెకు ఇస్తూ వచ్చారు.
ఆ తర్వాత కొంత కాలం నుంచి కల్పన దూరంగా ఉంటూ వచ్చారు. అయితే ఆమె ఎందుకు నిద్ర మాత్రలు మింగారనేది తెలియడం లేదు. గత రెండు రోజుల నుంచి కల్పన బయటకు రాలేదని, ఇంటికి గొల్లెం వేసుకుని ఉండడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఈ కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. కల్పన ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన తెలిసిన వెంటనే సినీ రంగానికి చెందిన ప్రముఖులు, గాయనీ గాయకులు ఆస్పత్రికి తరలి వస్తున్నారు.
ప్రస్తుతం కల్పన వెంటిలేటర్ పై ఉందని సమాచారం. ఆమె ఆరోగ్యానికి సంబంధించి ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది.
Also Read : Ranya Rao Arrest Sensational :14.8 కేజీల గోల్డ్ సీజ్..నటి రన్యా రావు అరెస్ట్