Gul Renjith Chandran: తమిళంలో నటుడిగా మారిన మలయాళ సింగర్‌ గుల్‌ రంజిత్ !

తమిళంలో నటుడిగా మారిన మలయాళ సింగర్‌ గుల్‌ రంజిత్ !

Gul Renjith Chandran: మలయాళ నాట‌ సింగర్‌ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న యువ సింగర్‌ గుల్‌ రంజిత్ నటుడిగా మారాడు. మలయాళంలో పలు మ్యూజిక్‌ ఆల్బమ్స్‌తో పాటు షార్ట్ ఫిలిమ్స్ లో నటించిన గుల్ రంజిత్ ను దర్శకుడు అవతార్ తమిళ చిత్ర పరిశ్రమకు క‌ర్ర అనే సినిమాతో పరిచయం చేశారు. ఈ సినిమా చిత్రీకరణ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సినిమాలో 11 యేళ్ళ బాలికకు తండ్రిగా అద్భుతంగా నటించారు గుల్‌ రంజిత్(Gul Renjith Chandran). తాను నటించిన తొలి తమిళ చిత్రంలోనే ప్రతి ఒక్కరినీ ఆకట్టుకునే పాత్రలో అద్భుతంగా నటించారంటూ మూవీ యూనిట్‌ నుంచి ప్రశంసలందుకుంటున్నారు.దీనితో గుల్‌ రంజిత్ త‌మిళంలో వరుస అవకాశాలను అందిపుచ్చుకుంటున్నాడు.

Gul Renjith Chandran…

ఈ సినిమా పాటలు యూట్యూబ్‌లో విడుదలై ప్రేక్షకాదారణ పొందాయి. ప్రధానంగా ఈ సినిమాలో తండ్రి కుమార్తెల మధ్య అనుబంధాన్ని వివరిస్తూ సాగే ‘మగలే.. మగలే.. ’ అనే పాటకు విశేష ఆదరణ వస్తోంది. గతంలో అజిత్‌ నటించిన సూపర్‌ హిట్‌ మూవీ ‘విశ్వాసం’లోని ‘కన్నానే కన్నే..’ పాట కంటే ఈ పాట ప్రతి ఒక్కరి గుండెలు పిండేసేలా సాగుతుంది. ఈ సినిమాలో ఆయన 11 యేళ్ళ బాలికకు తండ్రిగా అద్భుతంగా నటించారు. తాను నటించిన తొలి తమిళ చిత్రంలోనే ప్రతి ఒక్కరినీ ఆకట్టుకునే పాత్రలో అద్భుతంగా నటించారంటూ మూవీ యూనిట్‌ నుంచి ప్రశంసలందుకుంటున్నారు.ఇలా తన తొలి సినిమాతోనే ప్రతి ఒక్కరీ ప్రశంసలందుకుంటున్న గుల్‌ రంజిత్ కు దర్శకుడు విఘ్నేష్‌ శివన్‌ చిత్రంతో పాటు మరో రెండు చిత్రాల్లో నటించే అవకాశం అందిపుచ్చుకోవడం గమనార్హం. పైగా తన తొలి చిత్రం క‌ర్ర విడుదలైతే మరిన్ని సినిమా అవకాశాలు వస్తాయన్న విశ్వాసాన్ని గుల్ రంజిత్ వ్యక్తం చేస్తున్నారు.

Also Read : Kaalam Rasina Kathalu: యూత్ ఫుల్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ గా ‘కాలం రాసిన కథలు’ !

avatarGul Renjith ChandranKaraaVignesh Shivan
Comments (0)
Add Comment