Alka Yagnik: సడెన్‌గా వినికిడి శక్తి కోల్పోయిన బాలీవుడ్ టాప్‌ సింగర్‌ !

సడెన్‌గా వినికిడి శక్తి కోల్పోయిన బాలీవుడ్ టాప్‌ సింగర్‌ !

Alka Yagnik: ప్రముఖ గాయని అల్కా యాగ్నిక్‌ సడెన్ గా వినికిడి శక్తి కోల్పోయారు. ఎక్కువ సౌండ్ లో పాటలు వినడం, తరచూ ఇయర్ ఫోన్స్ వాడటం వలన న్యూరల్‌ హియరింగ్‌ లాస్‌ అనే అరుదైన వ్యాధితో బాధపడుతున్నట్లు ఆమె తెలిపారు. ఇయర్‌ ఫోన్స్‌ కారణంగా ఆమె చెవులకు వైరల్‌ అటాక్ అయినట్లు చెప్పారు. అభిమానుల ప్రార్థనలు కావాలని కోరుతూ ఇన్‌స్టాలో ఎమోషనల్‌ పోస్ట్‌ పెట్టారు.

Alka Yagnik Issue

‘గత కొంతకాలంగా నేను కనిపించడం లేదని అందరూ మెసేజ్‌లు చేస్తున్నారు. వారందరి కోసం ఈ పోస్ట్‌ పెడుతున్నాను. కొన్ని వారాల క్రితం నేను విమానం దిగి వస్తుండగా సడెన్‌ గా నాకేమీ వినిపించలేదు. దీనితో డాక్టర్‌ను సంప్రదిస్తే న్యూరల్‌ హియరింగ్‌ లాస్‌ అనే అరుదైన వ్యాధి వచ్చినట్లు చెప్పారు. వైరల్‌ ఎటాక్‌ కారణంగా ఇలా జరిగిందన్నారు. ఇది నా జీవితంలో పెద్ద ఎదురుదెబ్బ. నాకు తెలియకుండానే దీని బారినపడ్డాను. దయచేసి నాకోసం మీరంతా ప్రార్థించండి. నా అభిమానులకు, సహచరులకు ఒక్కటే చెబుతున్నాను. పెద్ద సౌండ్‌ తో మ్యూజిక్‌ వినడం, ఇయర్‌ ఫోన్స్‌ను ఉపయోగించడంలో జాగ్రత్త వహించండి. నా వృత్తిపరమైన జీవితం వల్ల కలిగిన తలెత్తిన అనారోగ్య సమస్యల గురించి భవిష్యత్తులో చెబుతాను. మీ మద్దతు, ప్రేమతో త్వరలోనే నేను కోలుకుంటానని ఆశిస్తున్నాను. ఈ క్లిష్ట సమయంలో మీ సపోర్ట్‌ నాకెంతో అవసరం’ అని పేర్కొన్నారు.

సింగర్ అల్కా యాగ్నిక్‌(Alka Yagnik) పెట్టిన పోస్ట్‌కు టాప్‌ సింగర్స్‌, సంగీత దర్శకులు స్పందిస్తున్నారు. ‘డియర్‌ అల్కాజీ… ఇలాంటి వార్త విన్నందుకు చాలా బాధగా ఉంది. అసలు ఊహించలేదు. ధైర్యంగా ఉండండి’ అని శ్రేయా ఘోషల్‌ కామెంట్‌ పెట్టారు. త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నట్లు ఏఆర్‌ రెహమాన్‌, సోనూనిగమ్‌, శంకర్‌ మహదేవన్‌ లు రిప్లై పెట్టారు.

1966లో జన్మించిన అల్కా యాగ్నిక్‌(Alka Yagnik)… ఆరేళ్ల వయసు నుంచే పాడడం ప్రారంభించారు. బాలీవుడ్‌లో ఎన్నో హిట్‌ సాంగ్స్‌ పాడారు. తన కెరీర్‌లో ఇప్పటివరకు 25 భాషల్లో 20వేలకు పైగా పాటలు పాడారు. ఏడుసార్లు ఉత్తమ మహిళా ప్లేబ్యాక్‌ సింగర్‌గా ఫిల్మ్‌ఫేర్‌ అవార్డు గెలుచుకున్నారు. ఆమె ప్రతిభకు రెండు జాతీయ అవార్డులు వరించాయి. బాలీవుడ్‌లో మహిళా విభాగంలో అత్యధిక సోలో సాంగ్స్ పాడిన జాబితాలో లతా మంగేష్కర్‌, ఆశా భోస్లే తర్వాత అల్కా యాగ్నిక్‌ మూడో స్థానంలో నిలిచారు. 2002లో వచ్చిన ‘మనసుతో’ సినిమాలో ‘చిన్ని మనసే గాలిపటమై’ పాటతో తెలుగు ప్రేక్షకులను పలకరించారు. ఆ తర్వాత టాలీవుడ్‌లోనూ కొన్ని పాటలు పాడారు.

Also Read : Shraddha Kapoor: డేటింగ్‌ రూమర్స్‌పై స్పందించిన బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధాకపూర్‌ !

Alka Yagnikar rehamanBollywood SingerShreya Ghoshal
Comments (0)
Add Comment