Ramesh Babu Shocking : ఆ హీరోల వ‌ల్ల రూ. 100 కోట్లు న‌ష్టపోయా

సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేసిన నిర్మాత

Ramesh Babu : ప్ర‌ముఖ సినీ నిర్మాత సింగ‌న‌మ‌ల ర‌మేష్ బాబు(Ramesh Babu) సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఓ వ్యాపార‌వేత్త‌ను బెదిరించార‌న్న కేసులో జైలుకు వెళ్లి వ‌చ్చారు. ఇదే కేసులో త‌న‌ను కోర్టు నిర్దోషిగా ప్ర‌క‌టించింది. ఈ సంద‌ర్బంగా మీడియాతో మాట్లాడారు నిర్మాత‌. ఇండ‌స్ట్రీలో బాగుంటేనే ప‌ల‌క‌రిస్తార‌ని, ఆ త‌ర్వాత మ‌న వైపు చూడ‌ర‌ని వాపోయాడు. అంతే కాదు పెద్ద పెద్ద హీరోలతో సినిమాలు చేశాన‌ని కానీ ఏ ఒక్క‌రు స‌మ‌యానికి ఆదుకోలేద‌న్నారు.

Producer Ramesh Babu Shocking Comments

క‌నీసం త‌నను ప‌ల‌క‌రించిన పాపాన పోలేద‌న్నారు. విచిత్రం ఏమిటంటే సింగ‌న‌మ‌ల ర‌మేష్ బాబు సినీ ఇండ‌స్ట్రీలో టాప్ హీరోస్ గా పేరొందిన ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ తో పులి , సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబుతో ఖ‌లేజా సినిమాలు తీశాడు. ఖ‌లేజాకు ద‌ర్శ‌క‌త్వం త్రివిక్రం శ్రీ‌నివాస్ తీశాడు. ఇది బోర్లా ప‌డింది. ఇక పులి బ్యాక‌ప్ అయ్యింది.

పేర్లు బ‌య‌ట‌కు చెప్ప‌కుండానే సింగ‌న‌మ‌ల సినిమాల పేర్లు చెప్పేశాడు. ఆ ఇద్ద‌రూ త‌న గురించి ప‌ట్టించు కోలేదంటూ భావోద్వేగానికి లోన‌య్యాడు. ఏకంగా రూ. 100 కోట్లు న‌ష్ట పోయానంటూ క‌న్నీటి ప‌ర్యంతం అయ్యాడు.

ప్ర‌స్తుతం నిర్మాత సింగ‌న‌మ‌ల ర‌మేష్ బాబు చేసిన కామెంట్స్ తెలుగు చల‌న చిత్ర ప‌రిశ్ర‌మ‌లో క‌ల‌క‌లం రేపుతున్నాయి. పైకి స్టార్ హీరోలైనా నిర్మాత న‌ష్ట పోతే క‌నీసం ప‌ల‌కరించ‌క పోవ‌డం దారుణ‌మంటున్నారు నెటిజ‌న్లు.

Also Read : Beauty Huma Qureshi : క‌థ‌లో ద‌మ్ముంటే సినిమాలు స‌క్సెస్

CommentsProducerShockingViral
Comments (0)
Add Comment