Stomach acidity : గ్యాస్ సమస్యతో బాధపడుతున్నారా?

స్టమక్ ఎసిడిటీని తగ్గించే సింపుల్ టిప్స్

Stomach acidity : మన శరీరం మారుతున్న వాతవరణ కాలుష్యానికి అనుకూలంగా లేకపోవడం వలన అనేక ఆనారోగ్య సమస్యల భారిన పడుతున్నం. అందులో చాలా మందిని కలవరపెడుతున్న సమస్య యాసిడ్ రిఫ్లక్స్ లేదా స్టమక్ ఎసిడిటీ ఇది వ్యాధి కాకపోయినప్పటికి రోజంతా చికాకుగా ఉండటమే కాకుండా, ఆనారోగ్యంగా కూడా అనిపిస్తుంది. ఇది తీవ్రమైతే అనేక ఇతర వ్యాధులకు దారితీస్తుంది. అయితే ఈ సమస్య వచ్చినప్పుడు ఛాతిలో మంట,నోటి దుర్వాసన మరియు ఈ సమస్య తీవ్రమైతే మలంలో రక్తం వస్తాది. ఆహారం విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటే కొంత వరకు ఉపశమనంగా ఉంటుంది.ఎన్ని మందులు వాడిన గ్యాస్ సమస్య తగ్గడం లేదని ఆందోళన చెందడం వలన లాభం లేదు.

Stomach acidity :

ఈ యోగఆసనలు ట్రైచేస్తే గ్యాస్ సమస్య శాశ్వతంగా తగ్గిపోతుంది.

భుజంగాసం : భుజంగ అంటే తల ఎత్తిన పాము. అందుకే, ఈ ఆసనాన్ని కోబ్రా పోజ్ అని కూడా అంటారు. సూర్య నమస్కారం సమయంలో కూడా ఈ ఆసనం ఉంటుంది. ఈ ఆసనం ట్రైచేయడం వలన స్టమక్ ఎసిడిటీ(Stomach acidity) సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు.

సుప్తబద్దహ కోనాసన : గ్యాస్ సమస్యతో బాధపడే వారు కోనాసన ఆసనం చేయడం చాలా మంచిది.కోనాసనా కడుపులోని ఆమ్లం అన్నవాహికలోకి ప్రవేశించకుండా నిరోధించడానికి లోతైన శ్వాసను కలిగిస్తుంది. ఒత్తిడిని తగ్గిస్తుంది. ప్రారంభకులకు ఇది అత్యంత అనుకూలమైన ఆసనం. అలసిపోయిన శరీరం ఈ భంగిమలో విశ్రాంతి పొందుతుంది.

అర్ద మత్య్సేంద్రాసన : ఈ ఆసనం ఉదర కండరాలను సాగదీస్తుంది. దీన్ని చేయడం వలన రక్తప్రసరణను పెంచి శరీరంలోని పిత్తాన్ని తగ్గిస్తుంది. కడుపు, కాలేయం, క్లోమం, మూత్రాశయం యొక్క విధులను సులభతరం చేస్తుంది.

Also Read : Polimera 2 : పొలిమేర సినిమాను మిస్ చేసుకున్న స్టార్ కమెడీయన్

health tipsStomach acidityYoga Asanas
Comments (0)
Add Comment