Simbu: పవన్‌ కల్యాణ్‌ ‘ఓజీ’ కోసం శింబు పాట ! కన్ఫర్మ్ చేసిన చిత్ర యూనిట్ !

పవన్‌ కల్యాణ్‌ ‘ఓజీ’ కోసం శింబు పాట ! కన్ఫర్మ్ చేసిన చిత్ర యూనిట్ !

Simbu: యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ సుజిత్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తోన్న తాజా సినిమా ‘ఓజీ’. డి.వి.వి ఎంటర్‌టైన్‌మెంట్స్‌ నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్ సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా సెట్స్ పై ఉండగానే పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో బిజీగా మారడంతోపాటు ఏపీ డిప్యూటీ సీఎం గా బాధ్యతలు స్వీకరించడంతో ఈ సినిమాపై మరింత అంచనాలు పెరిగిపోయాయి. ఈ సినిమా నుండి ఏ చిన్న అప్ డేట్ వచ్చినా చాలు క్షణాల్లో ట్రెండింగ్ లోనికి వెళ్ళిపోతుంది. ఈ నేపథ్యంలో ‘ఓజీ’ సినిమాలో కోలీవుడ్ స్టార్ హీరో, సింగర్ శింబు(Simbu) ఓ పాట పాడినట్లు… ఆ పాట కోసం వచ్చిన రెమ్యునరేషన్ ను ఏపీ వరద బాధితులకు తన వంతు సహాయం క్రింద ఇవ్వాలని చిత్ర నిర్మాతలకు సూచించనట్లు గత కొంతకాలంగా సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఆ న్యూస్ ను కన్ఫర్మ్ చేస్తూ చిత్ర యూనిట్ ఓ ఫోటోను విడుదల చేసింది.

Simbu…

పవన్‌ కల్యాణ్‌ హీరోగా నటిస్తున్న ‘ఓజీ’ సినిమాలో తమిళ నటుడు శింబు ఓ పాట పాడనున్నారంటూ ఇటీవల ప్రచారం జరిగింది. ఇప్పుడు దానిపై క్లారిటీ వచ్చింది. శింబుతో కలిసి తమన్‌, సుజీత్‌ దిగిన ఫొటోను సోషల్‌ మీడియాలో పంచుకుంటూ క్లారిటీ ఇచ్చింది. దీనిని బట్టి ‘ఓజీ’లో శింబు పాట పాడారని తెలుస్తోంది. త్వరలోనే ఆ పాట బయటకు రానుందని నిర్మాణ సంస్థ పోస్ట్‌ చేసింది. గ్యాంగ్‌స్టర్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌ ఫిల్మ్‌గా ‘ఓజీ’ తెరకెక్కుతోంది. ప్రియాంకా మోహన్‌ హీరోయిన్‌. ఇమ్రాన్‌ హష్మీ విలన్‌ గా కనిపించనున్నారు. రాజకీయాల్లో బిజీ అయిన పవన్‌ కల్యాణ్‌ ‘హరి హర వీరమల్లు’, ‘ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌’ చిత్రాలను పూర్తి చేయాల్సి ఉంది. ‘హరి హర వీరమల్లు’ సినిమా షూటింగ్‌ ఈ నెల 23న పునః ప్రారంభం కానుంది. అదే రోజు పవన్‌ సెట్స్‌లో అడుగుపెట్టనున్నారని ఇటీవల మేకర్స్‌ తెలిపారు.

Also Read : David Warner: నితిన్‌ సినిమాలో ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్‌ వార్నర్‌ !

ogpawan kalyanSimbuThaman S
Comments (0)
Add Comment