SIMBAA: జగపతి బాబు, అనసూయ ప్రధాన పాత్రల్లో నటించిన తాజా సైన్స్ ఫిక్షన్ క్రైమ్ థ్రిల్లర్ చిత్రం ‘సింబా(SIMBAA)’. సంపత్ నంది టీం వర్క్స్, రాజ్ దాసరి ప్రొడక్షన్స్ బ్యానర్లపై సంపత్ నంది, దాసరి రాజేందర రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. సంపత్ నంది అందించిన ఈ కథకు మురళీ మనోహర్ దర్శకత్వం వహించారు. డిఫరెంట్ కాన్సెప్ట్ తో ఆగస్ట్ 9న థియేటర్లలోకి వచ్చిన ఈ ‘సింబా’ మూవీ మిశ్రమ స్పందనను దక్కించుకుని విమర్శకుల ప్రశంసలు సైతం అందుకున్నప్పటికీ కమర్షియల్‌గా విజయం సాధించలేకపోయింది. అయితే ఇటీవల ఓటీటీకి వచ్చిన ‘సింబా’ డిజిటల్ స్ట్రీమింగ్ లో రికార్డులు తిరగరాస్తోంది. ఊహించిన దాని కన్నా మించి వ్యూస్ సాధిస్తూ ట్రెండింగ్ లో నిలుస్తోంది.
SIMBAA Movie OTT Updates
గతంలో ఎన్నడు చూడని విధంగా ప్రకృతికి ఆగ్రహానికి గురైతే ఎలా ఉంటుంది, వృక్షో రక్షతి రక్షితః అనే కథతో ఈ సింబా సినిమాను రూపొందించారు. చెట్లను పెంచాల్సిన బాధ్యత మన మీద ఎంత ఉంది? ఎందుకు ఉంది? అనేది ఈ చిత్రంలో చక్కగా చూపించారు. బయోలాజికల్ మెమరీ కాన్సెప్ట్, పర్యావరణ సందేశంతో ప్రయోగాత్మకంగా రూపొందిన ఈ సినిమా సెప్టెంబర్ 6న అమెజాన్ ప్రైమ్, ఆహా ఓటీటీల్లోకి రాగా గత పది రోజులుగా ట్రెండింగ్ లో ఉంది. ఈ మధ్యలో చాలా సినిమాలు డిజిటల్ స్ట్రీమింగ్ కు వచ్చినా ‘సింబా’ మూవీ మాత్రం తన ప్రత్యేకతను చాటుకుంది. తాజాగా తెలుగు రాష్ట్రాల్లో వరదల సమయంలో ఈ సింబా మూవీలోని డైలాగ్స్, సీన్స్ బాగా వైరల్ అవడం విశేషం.
Also Read : Aishwarya Rajinikanth: దర్శకుల సంఘానికి యేటా రూ.10 లక్షల విరాళం ప్రకటించిన ఐశ్వర్య రజనీకాంత్ !