Silk Smitha: భారతీయ చలన చిత్ర పరిశ్రమలో పరిచయం అక్కర్లేని అతి తక్కువ మంది నటీమణుల్లో సిల్క్ స్మిత ఒకరు. మత్తేక్కించే చూపులతో గ్లామరస్ తారగా, కైపెక్కించే స్టెప్పులతో మంచి డ్యాన్సర్ గా… తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో ఎన్నో ఐటెం సాంగ్స్ లో నర్తించింది సిల్క్ స్మిత(Silk Smitha). హీరో, హీరోయిన్ తో సంబంధం లేకుండా సిల్క్ స్మిత పాట ఉంటే చాలు థియేటర్లు కిక్కిరిసిపోయే పరిస్థితి ఏర్పడింది. అయితే ఎన్నో వ్యక్తిగత, వృత్తిపరమైన ఒడిదొడుకులను ఎదుర్కొన్న సిల్క్ స్మిత 1996 సెప్టెంబర్ 23న ఆత్మహత్య చేసుకుని… తన అభిమానులను తీవ్ర విషాదంలోనికి నెట్టింది.
Silk Smitha – విద్యాబాలన్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘డర్టీ పిక్ఛర్’
సిల్క్ స్మిత చనిపోయిన చాలా ఏళ్ళ పాటు ఆమెకు ఉన్న క్రేజ్ ను చూసిన బాలీవుడ్ దర్శకుడు మిలన్ లూథ్రియా… సిల్క్ స్మిత జీవిత చరిత్ర ఆధారంగా ‘ది డర్టీ పిక్చర్’ పేరుతో తెరకెక్కిన ఈ సినిమాలో సిల్క్ స్మిత(Silk Smitha) పాత్రలో విద్యా బాలన్ జీవించారు. ఇమ్రాన్ హష్మీ, నసీరుద్దీన్ షా, తుషార్ కపూర్ కీలక పాత్రలు పోషించిన ఈ సినిమా సిల్క్ స్మిత పుట్టిన రోజు సందర్భంగా 2011 డిసెంబరు 2న విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఈ సినిమాకు దర్శకుడు లూథ్రియా, నటి విద్యాబాలన్, సహాయ నటుడు నసీరుద్దీన్ షాలు అనేక జాతీయ, ఫిల్మ్ ఫేర్ అవార్డులు సొంతం చేసుకున్నారు.
‘సిల్క్ స్మిత ది అన్‌టోల్డ్ స్టోరీ’ పేరుతో రెండో సారి తెరకెక్కుతున్న సిల్క్ బయోపిక్
అయితే సిల్క్ స్మిత జీవితాన్ని ఆధారంగా చేసుకుని పాన్ ఇండియా స్థాయిలో మరో బయోపిక్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. భారత సంతతికి చెందిన ఆస్ట్రేలియన్ మోడల్ చంద్రికా రవి ప్రధాన పాత్రలో నటిస్తోన్న ఈ చిత్రాన్ని జయరామ్ అనే నూతన దర్శకుడు దర్శకత్వం వహిస్తున్నారు. ‘సిల్క్ స్మిత(Silk Smitha) ది అన్‌టోల్డ్ స్టోరీ’ పేరుతో వచ్చే ఏడాది ఈ సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు.
ఈ సందర్భంగా శనివారం సిల్క్ స్మిత జయంతిని పురస్కరించుకుని… ఈ చిత్రబృందం విడుదల చేసిన ఫస్ట్‌లుక్ పోస్టర్ కు మంచి రెస్పాన్స్ వస్తుంది. ఇందులో చంద్రిక.. అచ్చం సిల్క్ స్మితలా కనిపిస్తున్నారు. ఇక చంద్రికా రవి విషయానికి వస్తే… ‘చీకటి గదిలో చితక్కొట్టుడు’ సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన ఈమె ఇటీవల ‘వీర సింహారెడ్డి’లో ‘మా మనోభావాలు దెబ్బతిన్నాయి’ అనే పాటకు బాలయ్యతో మాస్ స్టెప్పులేసింది.
Also Read : Sai Dharam Tej: హాలీవుడ్ నుండి ఆహ్వానం అందుకున్న సాయి ధరమ్ తేజ్