Sikandar : కండల వీరుడు సల్మాన్ ఖాన్, నేషనల్ క్రష్ రష్మిక మందన్న కలిసి నటించిన చిత్రం సికిందర్(Sikandar). ప్రస్తుతం షూటింగ్ పూర్తయ్యే దశలో ఉంది. దీనిని చాన్నాళ్ల తర్వాత తమిళ స్టార్ డైరెక్టర్ ఏఆర్ మురుగదాస్ తీస్తుండడం విశేషం. దీంతో ఖాన్ అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఇప్పటికే సినిమాకు సంబంధించి రిలీజ్ చేసిన పోస్టర్స్, టీజర్, సాంగ్స్ కు పెద్ద ఎత్తున ఆదరణ లభిస్తోంది.
Sikandar Song Release
తాజాగా సినిమా నుంచి 2వ సాంగ్ ను విడుదల చేశారు మూవీ మేకర్స్. టేకింగ్, మేకింగ్ లో తనదైన ముద్ర కనబర్చడంలో తనకు తనే సాటి ఏఆర్ మురుగదాస్. గతంలో తాను బాలీవుడ్ లో స్టార్ హీరో అమీర్ ఖాన్ తో గజని మూవీ తీశాడు. అది బ్లాక్ బస్టర్ గా నిలిచింది.
ఇక తమిళ సినిమాల గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన పని లేదు. దళపతి విజయ్ తో మురుగదాస్ తీసిన సర్కార్ ఇప్పటికీ ఎప్పటికీ ఓ సూపర్ మూవీగా నిలిచి పోతుందని చెప్పడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు.
ప్రస్తుతం విడుదలైన తేరా ఖ్వాబ్ పాట చిత్రీకరణ సూపర్ గా ఉందంటూ ఫ్యాన్స్ తెగ సంబరపడి పోతున్నారు. త్వరలో విడుదల చేసేందుకు కసరత్తు చేస్తున్నాడు ఏఆర్ మురుగదాస్. దీనిపై పూర్తి నమ్మకం పెట్టుకుని ఉన్నాడు కండలవీరుడు సల్మాన్ ఖాన్. ఇక తనకున్న ఆదరణలో మరోసారి తళుక్కున మెరిసింది అందాల ముద్దుగుమ్మ రష్మిక మందన్న.
Also Read : Champions Trophy 2025 Final :ఫైనల్ కు చేరిన న్యూజిలాండ్