Rashmika : తమిళ సినీ దర్శకుడు ఏఆర్ మురుగదాస్ దర్శకత్వం వహించిన చిత్రం సికిందర్. ఇందులో కీలక పాత్రలు పోషించారు బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్, నేషనల్ క్రష్ రష్మిక మందన్నా(Rashmika). స్టార్ ఇమేజ్ లు ఉన్న ఈ ఇద్దరు సినిమాను రక్షించ లేక పోయినట్లు విస్తృతంగా ప్రచారం జరిగింది. భారీ బడ్జెట్ తో సికందర్ ను తెరకెక్కించారు. మార్చి 30న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. ఆశించిన మేర ఆకట్టుకోలేక పోయిందనే టాక్ కొనసాగుతోంది.
Rashmika Mandanna Shocking with Sikandar Movie Talk
కాగా గతంలో స్టార్స్ ను చూసి ప్రేక్షకులు సినిమాల లోకి వెళ్లి పోయే వారు. కానీ ఇప్పుడు సీన్ మారింది. కేవలం కథ బాగుంటేనే థియేటర్ల వద్దకు వెళుతున్నారు. వారి అభిరుచులు, ఆలోచనల్లో మార్పు వచ్చింది. కంటెంట్ ఉన్న వాటికే ఓటు వేస్తున్నారు . జై కొడుతున్నారు. సినిమాలను ఆదరిస్తున్నారు. భాష, ప్రాంతంతో సంబంధం లేకుండానే సక్సెస్ చేస్తున్నారు. తాజాగా వచ్చిన సికందర్ బాక్సాఫీస్ వద్ద అంతగా ఆకట్టు కోలేక పోయిందనే ప్రచారం జోరుగా సాగుతోంది. సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోల్స్ కొనసాగుతున్నాయి.
ఇది పక్కన పెడితే రష్మిక మందన్న ప్రస్తుతం దేశంలోనే నెంబర్ వన్ హీరోయిన్ గా కొనసాగుతోంది. ఇప్పటి వరకు తాను నటించిన మూడు సినిమాలు వరుసగా కోట్లు కురిపించాయి. పుష్ప-2 సీక్వెల్ చిత్రం ఏకంగా రూ. 1867 కోట్లు సాధించింది. అంతకు ముందు వచ్చిన యానిమల్ రూ. 1000 కోట్లు వసూలు చేసింది. ఇటీవల ముంబై వీరుడు ఛత్రపతి శివాజీ తనయుడు శంభాజీ జీవిత కథ ఆధారంగా వచ్చిన చిత్రం ఛావా రూ. 500 కోట్లు సాధించింది. మొత్తం ఈ మూడు సినిమాలు రూ. 3000 కోట్లు వసూలు చేసింది.
Also Read : Harish Shankar Sensational :కుటుంబం కోసం త్యాగం చేశాం