తమిళ సినీ రంగంలో అత్యుత్తమమైన నటులలో ఒకడిగా గుర్తింపు పొందాడు ఆర్. మాధవన్. ఆయన ఇటీవల తీసిన రాకెట్రీ – ది నంబి ఎఫెక్ట్ చిత్రం పలువురి ప్రశంసలు అందుకుంది. జాతీయ స్థాయిలో కూడా అవార్డు దక్కింది.
తాజాగా దుబాయ్ వేదికగా జరిగిన సైమా అవార్డ్స్ 2023లో తమిళ సినీ రంగానికి చెందిన కేటగిరీలో అత్యుత్తమ నటుడిగా ఎంపికయ్యాడు ఆర్. మాధవన్. ఈ చిత్రంలో తాను నటించడమే కాక తను దర్శకత్వం వహించాడు.
ఇస్రోలో పని చేసిన సైంటిస్టు నంబియార్ చరిత్రను ఉన్నది ఉన్నట్టు తెరకెక్కించే ప్రయత్నం చేశాడు ఆర్. మాధవన్. ఈ సందర్బంగా నటుడు మాట్లాడుతూ సైమా పురస్కారం లభించడం తనను సంతోషానికి గురి చేసిందన్నాడు.
ప్రస్తుతం ట్రెండ్ మారుతోందని, గతంలో హీరో హీరోయిన్లకు ప్రయారిటీ ఉంటోందని కానీ రాను రాను కథకు ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నారని చెప్పాడు. ఈ క్రెడిట్ అంతా నంబియార్ కే దక్కుతుందన్నాడు ఆర్. మాధవన్. ఎన్నో అవమానాలు ఎదుర్కొని చివరకు విజేతగా నిలబడడం మామూలు విషయం కాదన్నాడు.