దుబాయ్ – తనకు సైమా లాంటి ప్రతిష్టాత్మకమైన పురస్కారం దక్కుతుందని కలలో కూడా అనుకోలేదన్నారు నటి మృణాల్ ఠాకూర్. దుబాయ్ వేదికగా సైమా అవార్డ్స్ 2023 సందర్బంగా అవార్డుల ప్రధానోత్సవం అంగరంగ వైభవోపేతంగా జరిగింది.
ఈ కార్యక్రమానికి తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ సినీ రంగాలకు చెందిన నటీ నటులు, ఇతర సాంకేతిక నిపుణులు హాజరయ్యారు. ఈ సందర్బంగా తెలుగు సినీ రంగానికి సంబంధించి అవార్డులను ప్రకటించింది సైమా.
ఉత్తమ దర్శకుడిగా ఎస్ఎస్ రాజమౌళి, ఉత్తమ నటుడిగా జూనియర్ ఎన్టీఆర్, ఉత్తమ నటిగా శ్రీలీల ఎంపికయ్యారు. నూతనంగా సినీ రంగానికి చెందిన మృణాల్ ఠాకూర్ ను ఎంపిక చేసింది సైమా. సీతా రామం సినిమాలో అద్భుతంగా నటించింది.
తన అమాయకత్వంతో మెస్మరైజ్ చేసింది తెలుగు సినీ ప్రేక్షకులను. పెద్ద తెరపై ఆమె పాత్రకు ప్రాణం పోసింది. ఈ చిత్రంలో దుల్కర్ సల్మాన్ మిలటరీ ఆఫీసర్ గా ప్రధాన పాత్ర పోషించాడు. మహానటి తర్వాత తెలుగులో నటించిన రెండో చిత్రం కావడం విశేషం. సీతారామంలో తొలుత దర్శకుడు పూజా హెగ్డేను అనుకున్నారు. కానీ ఆమె ఒప్పుకోక పోవడంతో మృణాల్ ఠాకూర్ నటించారు.