Sidharth Malhotra: ఆకట్టుకుంటోన్న సిద్ధార్ధ్ మల్హోత్రా ‘యోధ’ ట్రైలర్ !

ఆకట్టుకుంటోన్న సిద్ధార్ధ్ మల్హోత్రా ‘యోధ’ ట్రైలర్ !

Sidharth Malhotra: ధర్మా ప్రొడక్షన్స్‌, అమెజాన్‌ ఎంజీఎం స్టూడియోస్‌ పతాకాలపై కరణ్‌ జోహార్‌, అపూర్వ మెహతా, శశాంక్‌ ఖైతాన్‌, హీరూ యశ్‌ జోహార్‌ నిర్మిస్తున్న తాజా సినిమా ‘యోధ’. పుష్కర్‌ ఓఝా, సాగర్‌ అంబ్రే సంయుక్తంగా దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో సిద్ధార్థ్‌ మల్హోత్రా, దిశా పటానీ, రాశీ ఖన్నా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. హైజాక్‌కి గురైన ఒక భారతీయ విమానాన్ని ఉగ్రవాదుల చెర నుంచి సురక్షితంగా రక్షించి… తీవ్రవాదుల్ని మట్టి కరిపించే యోధుడిగా ఆర్మీ కమాండో అరుణ్‌ కత్యాల్‌ పాత్రలో సిద్ధార్థ్‌ మల్హోత్రా(Sidharth Malhotra) నటిస్తున్న ఈ సినిమా మార్చి 15న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతుంది. ఈ నేపథ్యంలో ‘యోధ’ సినిమాకు సంబంధించిన ట్రైలర్ ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ప్రస్తుతం ఈ ట్రైలర్ అభిమానులను విశేషంగా ఆకట్టుకోవడంతో పాటు సిద్ధార్ధ్ మల్హోత్రా చెప్పిన కొన్ని డైలాగ్ లు దేశభక్తిని ప్రేరేపిస్తోంది.

Sidharth Malhotra Movie Updates

‘ఈరోజు నేను ఉండొచ్చు ఉండకపోవచ్చు.. కానీ దేశం ఎప్పటికీ ఉంటుంది.. నా మాతృభూమి కోసం నేను ఏం చేయడానికైనా సిద్ధం’ అంటూ సిద్ధార్థ్‌ మల్హోత్రా చెప్పిన డైలాగ్ ట్రైలర్ కు సెంట్రాఫ్ ఎట్రాక్షన్ గా నిలుస్తోంది. ‘ప్రతి ఒక్కరికీ ఓ కల ఉంటుంది. మా నాన్నలా సైన్యంలో చేరడం నా స్వప్నం..’, ‘నేనెప్పుడూ ఒకటే అనుకుంటా.. నా శరీరంపై ఎప్పుడూ యుద్ధంలో పోరాడే సైనికుడి దుస్తులుండాలి.. లేదా నా శవాన్ని మువ్వన్నెల జెండా చుట్టేయాలి’, ‘చర్చల ద్వారా సమస్య పరిష్కరించడం ఈ వీరుడి స్టైల్‌ కానే కాదు… పోరాటమే ఈ యోధుడి లక్షణం’ లాంటి సిద్ధార్ధ్ చెప్పిన డైలాగులు అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.

Also Read : Kishore Reddy: యాంకర్‌ కేసీను పెళ్లి చేసుకున్న ‘శ్రీకారం’ దర్శకుడు !

Karan JoharSidharth MalhotraYodha
Comments (0)
Add Comment