Siddu Jonnalagadda : టాలీవుడ్ లో యంగ్ హీరోగా క్రేజ్ దక్కించుకున్న జొన్నలగడ్డ సిద్దు(Siddu Jonnalagadda) నటించిన జాక్ కు సంబంధించి కీలక అప్ డేట్ వచ్చింది. దీనికి క్యాప్షన్ కూడా క్రేజీగా పెట్టారు. జాక్ కొంచెం క్రాక్ అంటూ పోస్టర్స్, టీజర్ రిలీజ్ చేశారు. దీనికి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఇప్పటికే సిద్దు నటించిన టిల్లు స్క్వేర్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ప్రస్తుతం తెలుసు కదా అనే చిత్రం చేస్తున్నాడు. దీనికంటే ముందే జాక్ స్టార్ట్ అయ్యింది. బీవీఎస్ఎన్ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా సక్సెస్ ఫుల్ డైరెక్టర్ బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహిస్తున్నాడు.
Siddu Jonnalagadda Movie Updates
దీంతో జాక్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. సిద్దుకు జతగా బేబీ ఫేమ్ హీరోయిన్ వైష్ణవి చైతన్య నటిస్తోంది. ఈ మూవీని వచ్చే నెల ఏప్రిల్ 10న విడుదల చేస్తామని మూవీ మేకర్స్ ప్రకటించారు. ఇదే సమయంలో డార్లింగ్ ప్రభాస్ నటించిన మారుతి దర్శకత్వం వహించిన రాజా సాబ్ కూడా రానుంది ఇదే మంత్ లో. ఈ సినిమాలో ప్రకాశ్ రాజ్ కీలక పాత్ర పోషిస్తున్నారు.
ఇక బొమ్మరిల్లు భాస్కర్ గురించి ఎంత చెప్పినా తక్కువే. తను సినిమా ఇండస్ట్రీలో మినిమం గ్యారెంటీ దర్శకుడిగా పేరు పొందారు. యూత్ లో ఎక్కువగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది సిద్దు జొన్నలగడ్డకు. అంతే కాకుండా వైష్ణవి చైతన్య కు మంచి క్రేజ్ కూడా ఉంది. దీంతో ఈ ఇద్దరి కాంబోపై ఉత్కంఠ నెలకొంది ఫ్యాన్స్ లో.
Also Read : Champions Trophy 2025 Final – IND Vs NZ :కప్ కోసం సమ ఉజ్జీల పోరాటం