Siddu Jonnalagadda : తొలి సినిమా ‘డీజే టిల్లు’ తో టాలీవుడ్ లో ప్రత్యేక ఫ్యాన్ బేస్ ను ఏర్పాటు చేసుకున్న హీరో సిద్ధు జొన్నలగడ్డ. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ నిర్మించిన ఈ సినిమాకు విమల్‌కృష్ణ దర్శకత్వం వహించాడు. సిద్ధు జొన్నలగడ్డ(Siddu Jonnalagadda) సరసన నేహా శెట్టి నటించిన ఈ సినిమా 2022లో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. సిద్ధు తెలంగాణా యాస, టైమింగ్ పంచ్ లు, రామ్ మిరియాల టైటిల్ సాంగ్ అన్నీ కలిసి ‘డీజే టిల్లు’కు కాసుల వర్షం కురిపించాయి.
Siddu Jonnalagadda – ‘డీజే టిల్లు’ కు సీక్వెల్ గా ‘టిల్లు స్వ్కేర్’
దీనితో ‘డీజే టిల్లు’ కు సీక్వెల్ గా ‘టిల్లు స్వ్కేర్’ తో మరోసారి ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు సిద్దు జొన్నలగడ్డ. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న ఈ సినిమాకు మల్లిక్ రామ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఈ సినిమా నుండి రిలీజ్ అయిన ఫస్ట్ సింగిల్ ‘టికెట్టే కొనకుండా’ పాట ఇప్పటికే అభిమానులను అలరిస్తోంది. ఇప్పుడు సెకండ్ సింగిల్ ‘రాధిక’ను తాజాగా చిత్ర యూనిట్ విడుదల చేసింది.
‘టిల్లు స్వ్కేర్’ నుండి సెకండ్ సింగిల్ రాధిక రిలీజ్
చెప్పు రాధిక… ఏం కావాలి నీకు… నీకు ఎలా సహాయపడగలను… ఈ సారి నా కొంప ఎట్లా ముంచబోతున్నావు అంటూ సిద్దు డైలాగ్ తో ప్రారంభమైన ఈ పాటకు శ్యామ్ సాహిత్యం అందించారు. ఈ పాట ద్వారా ‘డీజే టిల్లు’ లో రాధిక పాత్రను ‘టిల్లు స్వ్కేర్’ లోని లిల్లీ తో సిద్దు పోల్చుతున్నట్లు ఉంది. ప్రస్తుతం ఆ సాంగ్ యూ ట్యూబ్ లో మంచి వ్యూయర్ షిప్ సంపాదించుకుంది. ఈ సాంగ్ పై నటి అనుపమ పరమేశ్వరన్ చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ సినిమా 2024, ఫిబ్రవరి 9వ తేదీన విడుదలకు సిద్ధమవుతున్న ఈ సినిమాకు రామ్ మిరియాల సంగీతమందిస్తున్నారు.
Also Read : Mahesh-Ranbir: ‘డెవిల్’ గా మిస్సయిన మహేష్ బాబు… ‘యానిమల్’ గా కనెక్ట్ అయిన రణ్ బీర్