Siddu Jonnalagadda: డిజే టిల్లుతో జోడీ కడుతున్న బేబీ బ్యూటీ

డిజే టిల్లుతో జోడీ కడుతున్న బేబీ బ్యూటీ

Siddu Jonnalagadda : డిజే టిల్లు సినిమాతో ప్రేక్షకులకు దగ్గరయిన యంగ్ హీరో సిద్ధు జొన్నలగడ్డ( Siddu Jonnalagadda). ‘బేబి’ సినిమాతో మెగాస్టార్ చిరంజీవితో నటిగా ప్రశంసలు అందుకున్న బ్యూటీ వైష్ణవి చైతన్య. వీరిద్దరి సినిమాల్లో కూడా తెలంగాణా యాస కామన్ గా ఉంటుంది. అదే యాసతో కేవలం తెలంగాణే ప్రేక్షకులనే కాకుండా యావత్ ప్రపచంలో ఉన్న తెలుగు ప్రేక్షకులకు వీరు దగ్గరయ్యారు. ఈ నేపథ్యంలో వీరిద్దరి కాంబినేషన్ లో కొత్త సినిమాకు కథని సిద్ధం చేసారు.

Siddu Jonnalagadda – సిద్ధు-వైష్ణవి-భాష్కర్ కాంబోలో డిసెంబరు మొదటి వారంలో ప్రారంభం కాబోతున్న కొత్త సినిమా

సిద్ధు జొన్నలగడ్డ – బొమ్మరిల్లు భాస్కర్‌ కలయికలో ఇటీవల ఓ చిత్రం ప్రారంభమైంది. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర పతాకంపై బి.వి.ఎస్‌.ఎన్‌.ప్రసాద్‌ నిర్మిస్తున్న ఈ సినిమా ను షూటింగ్ ను డిసెంబరు ఫస్ట్ వీక్ ను ప్రారంభించనున్నారు. అందుకోసం ఏర్పాట్లు కూడా పూర్తి చేసినట్టు సినీ వర్గాలు తెలిపాయి. అయితే ఈ సినిమాలో సిద్ధు జొన్నలగడ్డ సరసన వైష్ణవి చైతన్య నటిస్తోందని తాజాగా చిత్ర యూనిట్ వెల్లడించింది. సిద్ధు-వైష్ణవి వంటి ఆసక్తికరమైన కలయికలో రూపొందుతున్న ఈ సినిమా కోసం బొమ్మరిల్లు భాస్కర్‌ విభిన్నమైన కథని సిద్ధం చేసినట్టు సినీ వర్గాల సమాచారం.

Also Read : Manchu Vishnu: ఆకట్టుకుంటున్న మంచు విష్ణు ‘కన్నప్ప’ ఫస్ట్ లుక్

Babybommarillu bhaskarSiddu JonnalagaddaVaishnavi Chaitanya
Comments (0)
Add Comment