Jack : టాలీవుడ్ లో మోస్ట్ ఫేవరేట్ ,వెరీ వెరీ స్పెషల్ డైరెక్టర్లలో తను కూడా ఒకడు. ఎందుకంటే తను తీసిన బొమ్మరిల్లు ఇప్పటికీ ఎప్పటికీ ఎవర్ గ్రీన్ క్లాసిక్. తెలుగు వారి లోగిళ్లలో ఈ సినిమా ఫీల్ గుడ్ ను అందించేలా చేసింది. అక్కినేని అఖిల్, పూజా హెగ్డేతో కలిసి తీసిన బ్యాచ్ లర్ మూవీ సూపర్ సక్సెస్ అయ్యింది. తాజాగా మరో సినిమాతో ముందుకు రాబోతున్నాడు దర్శకుడు. ఏ కథ తీసుకున్నా అందులో ఏదో ఒక ప్రత్యేకత ఉండేలా చూడటం ఇష్టం.
Siddu Jonnalagadda Jack Movie Updates
యువతలో మంచి క్రేజ్ కలిగిన నటుడిగా గుర్తింపు పొందారు సిద్దు జొన్నలగడ్డ(Siddu Jonnalagadda), వైష్ణవి చైతన్య. ఈ ఇద్దరి కాంబినేషన్ లో తను జాక్ పేరుతో సినిమా తీశాడు. ఈ చిత్రానికి సంబంధించిన పోస్టర్స్, టీజర్, సాంగ్స్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది ప్రేక్షకుల నుంచి . ముఖ్యంగా డైలాగులు కూడా ఆకట్టుకునేలా ఉన్నాయి. దీంతో అంచనాలు పెరిగాయి ఈ సినిమాపై. తాజాగా మూవీ మేకర్స్ నుంచి కీలక అప్ డేట్ వచ్చింది. అదేమిటంటే జాక్ ను ఏప్రిల్ 10న విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు.
తాజాగా గురువారం రోజు ముహూర్తం బాగుందని జాక్ నుంచి ట్రైలర్ రిలీజ్ చేశారు దర్శకుడు. వాస్తవానికి బుధవారం రిలీజ్ చేయాల్సి ఉంది. కానీ అనివార్య కారణాల వల్ల రాలేక పోయింది. ఈ సందర్బంగా నటుడు జొన్నలగడ్డ సిద్దు మాట్లాడుతూ గతంలో తాను నటించిన సినిమాల కంటే భిన్నంగా ఉంటుంది జాక్. ఇది తనకు అత్యంత సంతృప్తిని కలిగించిన సినిమా అని పేర్కొన్నాడు. తప్పకుండా హిట్ అవుతుందని చెప్పాడు.
Also Read : Beauty Niharika-Shobhan Movie : మ్యాడ్ స్క్వేర్ హీరోతో నిహారిక మూవీ